మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్….. బాబు కంటే టాప్ రేంజ్‌లో జగన్

- Advertisement -

అత్యంత ధనిక రాష్ట్రమైన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే అత్యంత అనుభవజ్ఙుడినైన ముఖ్యమంత్రిని, దేశంలోనే నన్ను మించిన నాయకుడు లేడు అని చెప్పుకునే చంద్రబాబును తోసిరాజని జాతీయ మీడియా సర్వేలలో జగన్ ముందు వరసలో నిలవడం అంటే మామూలు విషయమా? అధికారం లేదు. వైకాపా ఎమ్మెల్యేలను వరుసగా కొనేసి జగన్ పార్టీని మూసేయించాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నాడు. ఇక ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఒక్క అభివృద్ధీ పని కూడా జరగకూడదని పచ్చ బ్యాచ్ మొత్తం కంకణం కట్టుకుని ఉంది. అదే విషయాన్ని స్వయంగా పచ్చ బ్యాచ్ నంబర్ ఒన్ భజన జర్నలిస్ట్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి మీడియాలో గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయలేకపోయారని, ఫిరాయించాకే చించేస్తున్నారని ఆర్కే చెప్తూ ఉంటాడు. అఫ్కోర్స్…..జనాలు మాత్రం చంద్రబాబు జమానాలో మాకు ఒరిగింది ఏమీ లేదని సర్టిఫికెట్స్ ఇస్తున్నారు.

అందుకనో ఏమో గానీ చంద్రబాబు మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్‌లో జగన్ తర్వాత స్థానంలో ఉన్నాడు. మోడీ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో చంద్రబాబు 36వ స్థానంలో ఉంటే జగన్ మాత్రం 35వ స్థానంలో ఉన్నాడు. చంద్రబాబు కంటే ముందు జగన్ ఎలా అన్న ప్రశ్నకు కూడా ఆ జాతీయ మీడియా సంస్థ వివరణ ఇచ్చింది. ప్రత్యేక హోదాతో సహా అన్ని విషయాల్లోనూ చంద్రబాబు జగన్‌నే ఫాలో అవుతున్నాడని, హామీల విషయంలో కూడా జగన్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టాల్సిన దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడని ……..అన్నింటికీ మించి జగన్‌కి ఉన్న ప్రజాదరణ రోజు రోజుకూ పెరుగుతోందని ఆ జాతీయ మీడియా సంస్థ వివరించింది. త్వరలో విడుదల చేయబోయే సరికొత్త జాబితాలో జగన్ స్థానం ఇంకా ప్రథమ శ్రేణిలో ఉంటుందని …..చంద్రబాబు ర్యాంక్ పడిపోతుందన్న విశ్లేషణలు ఆ మీడియా సంస్థ జర్నలిస్టుల నుంచి వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -