Tuesday, May 21, 2024
- Advertisement -

శ్రీమంతుడు సినిమాకు 5/5 రేటింగ్ ఇచ్చిన దుబాయ్‌‌‍ రివ్యూవర్..!

- Advertisement -

పలు భాషలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజవుఅతున్న శ్రీమంతుడు సినిమాపై ఒక రివ్యూ సంచలనం రేపుతోంది. అదేంటంటే దుబాయ్‌కి చెందిన ఒక మ్యాగజైన్ రివ్యూ రైటర్ మరియు క్రిటిక్ కీరా సంధు శ్రీమంతుడు చిత్రానికి 5/5 గా రేటింగ్ ఇస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఈమె దుబాయ్‌కి చెందిన ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ అని తన ట్విట్టర్‌లో పేర్కొంది.

అంతే కాకుండా ఎన్నో అంచనాలతో సినిమాకు వెళుతున్న ప్రేక్షకులకు శ్రీమంతుడు ఒక బ్లాక్ బస్టర్‌ సినిమా లాగా అందరి అంచనాలను అందుకుంటుందని పేర్కొంది. భారీ కలెక్షన్స్‌ని సాధించడమే కాక బాహుబలి సినిమాను థియేటర్స్‌ నుంచి తరిమి కొడుతుందని వర్ణించి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పట్లో బాహుబలి సినిమా మీద రివ్యూ రాసి రేటింగ్ 2/5 గా ఇచ్చి బాహుబలి సినిమా బ్యూటిపుల్ బాడీ విత్ అవుట్ సోల్ అని పేర్కొంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురై ట్విట్టర్‌లో ఆమెను అటాక్‌ చేసిన విషయం తెలిసిందే..

ఫైనల్‌గా బహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె ఇచ్చిన రివ్యూ తప్పని తేలింది. ఈమె రివ్యూ పెట్టే సమయానికి దుబాయ్‌లో శ్రీమంతుడు రిలీజ్ అవ్వలేదని ఫిల్మ్ వర్గాల సమాచారం.  మరి ఈమె ఇచ్చిన రివ్యూ కరెక్టో కాదో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే….

మరి కొద్ది గంటల్లో సరి కొత్త రివ్యూతో ఆద్యా మీడియా మీ ముందుకు వస్తుంది.       

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -