Thursday, May 16, 2024
- Advertisement -

బాహుబలికి ’నో’ చెప్పి.. శ్రీమంతుడికి ఓకే చెప్పిన కేటిఆర్..!?

- Advertisement -

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటిఆర్ శ్రీమంతుడు సినిమాకు సహాయం చేశాడు. అప్పట్లో బాహుబలి సినిమాకు రాజమౌళి తెలంగాణ ప్రభుత్వాన్ని సహాయం అడిగినా అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు శ్రీమంతుడికి మాత్రం కేటిఆర్ అనుమతి ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి.

అసలు విషయం ఏంటంటే.. శ్రీమంతుడు సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే..  అయితే ఈ  సినిమా బెన్‌ఫిట్‌ షో కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని దర్శక, నిర్మాతలు అనుమతి కోరితే వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. దీంతో నిర్మాతలు భారీగా కలెక్షన్స్‌ని రాబట్టుకోవచ్చని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అప్పట్లో ’బాహుబలి’ సినిమాకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజుకి తెలంగాణ మంత్రి కేటిఆర్, ఎంపి కవితకు విభేదాలున్నాయని అందుకే అనుమతి ఇవ్వలేదట.. మొత్తానికి శ్రీమంతుడు ఛాన్స్  కొట్టేశాడు.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -