Friday, May 17, 2024
- Advertisement -

శ్రీమంతుడు రివ్యూ – తప్పక చూడండి…లేకపోతే లావయిపోతారు….

- Advertisement -

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు, శృతి హాసన్ జంటగా నటించిన శ్రీమంతుడు మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయింది.

ఈ సినిమా రిలీజ్‌కు ముందే పాజిటివ్ టాక్‌ రావడంతో మహేశ్‌బాబు అభిమానులు దీనిపైన భారీ అంచనాలు పెట్టుకున్నారు.

స్టార్ క్యాస్ట్ : మహేశ్‌బాబు, శృతి హాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్

ప్రొడ్యూసర్ : వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్

డైరెక్టర్: : కొరటాల శివ

మ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్

లైవ్‌ అప్‌డేట్స్ : 

టైటిల్స్ తర్వాత జగపతిబాబు ఒక రిచ్ బిజినెస్‌ ‌మ్యాన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ఆరంభం అవుతుంది. హీరో మహేశ్‌బాబు చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇస్తాడు. తర్వాత రామ రామ సాంగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ సాంగ్‌లో బ్యాక్‌ గ్రౌండ్ సెటింగ్స్ మరియు ఆర్ట్‌  సీన్స్‌ చాలా బాగున్నాయి. 

ప్రతి మనిషిలో అర్థం కాని విషయం ఒకటి ఉంటుంది అనే డైలాగ్ ఈ సినిమాలో మహేశ్‌బాబుది మొదటిది. మహేశ్‌బాబు పేరు సినిమాలో హర్షగా ఉంటుంది. ఇక హీరోయిన్ శృతి హాసన్ డ్రాయింగ్ రంగోలి‌తో ఎంట్రీ ఇస్తుంది. 

రాజేంద్రప్రసాద్ ఒక దేవరకోట అనే పల్లెటూరులో సంపత్‌నంది మీద రైజింగ్ వాయిస్‌తో ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడి నుంచి చాలా ఆసక్తిగా మహేశ్‌బాబు, శృతి హాసన్ కాలేజీలో సీన్స్ స్టార్ట్ అవుతాయి. 

ఇక్కడే రెండో సాంగ్ జతకలిసే.. స్టార్ట్ అవుతుంది. ఈ సాంగ్‌లో మహేశ్‌బాబు కాలేజ్‌ స్టూడెంట్‌గా చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తాడు. ఇక ఢిల్లీలో మినిష్టర్ క్యారెక్టర్‌తో ముఖేష్ ఋషి ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. చాలా అసక్తిగా ఉండేట్లు తెరకెక్కించారు. బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. దీని తర్వాత థర్డ్ సాంగ్ చారుషీల సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సాంగ్‌లో మహేశ్‌బాబు డ్యాన్స్‌ బాగా చేశాడు.

ఇప్పుడు ఒక ట్విస్ట్‌తో ఇంటర్వెల్ పడుతుంది. ఓ సూపర్ ఫైట్ సీన్ తో సినిమా ఊపందుకుంది. ఇంటర్వె‌ల్ తర్వాత సినిమా మొత్తం ఒక విలేజ్ డ్రాప్‌లోకి వెళుతుంది. మహేశ్ సైకిల్‌పై వచ్చే సీన్‌తో ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఆలి క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. తర్వాత సినిమాని కొరటాల శివ ఒక ఎమోషనల్ సీన్స్‌లోకి తీసుకెళ్ళాడు.  

జాగో మాంటేజ్‌ సాంగ్ ఇప్పుడే మొదలయింది. ఈ సాంగ్ తర్వాత రిలీజ్‌ టీజర్‌గా మన ముందుకొచ్చిన మహేశ్‌బాబు లుంగీ సీన్ తో ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఫ్యాన్స్‌ విజిల్స్‌తో థియేటర్‌ మొత్తం దద్దరిల్లుతుంది. జగపతి బాబు రీ ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ప్లాష్‌బ్యాక్ మోడల్లోకి వెళుతుంది.

జగపతిబాబు, మహేశ్‌బాబు సెకండ్‌ హాఫ్‌లో వచ్చే అన్నీ సీన్స్ సూపర్‌గా ఉన్నాయి. ఫాదర్, సన్ రిలేషన్‌షిప్‌ నిజ జీవితంలో ఎలా ఉంటాయో అలా కొరటాలశివ అద్బుతంగా తెరకెక్కించారు.   

 

హైలైట్స్:

మహేశ్‌బాబు

ఫాదర్‌ అండ్ సన్ రిలేషన్ 

ప్రీ క్లైమ్యాక్స్

ఎమోషనల్ సీక్వెన్సెస్ ఇన్ సెకండ్ హాఫ్‌

దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్

 

మైనస్‌ పాయింట్స్:

ఫస్ట్‌ హాఫ్‌ స్లో నెరేషన్

లెస్ కామెడీ

Rating: 3.75/5

Final Verdict: మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ శ్రీమంతుడు సినిమాని తప్పక చూడండి. లేకపోతే లావయిపోతారు. 

ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలి ఎంటర్‌టైనర్. అందరూ ఈ సీజన్‌లో ఎంజాయ్‌ చేయదగ్గ సినిమా. కొరటాల శివ ప్రతి సీన్ చాలా బాగా తీశారు. ఒక్క సీన్ కూడా బోరు కొట్టే విదంగా ఉండదు. ఊరి కోసం ఏదో ఒకటి చేయాలనే భావనతో అందరూ బయటికొస్తారు

   

Also Read: 

శ్రీమంతుడు సినిమాకు 5/5 రేటింగ్ ఇచ్చిన దుబాయ్‌‌‍ రివ్యూవర్..!

బాహుబలికి ’నో’ చెప్పి.. శ్రీమంతుడికి ఓకే చెప్పిన కేటిఆర్..!?

 

Srimanthudu Theatrical Trailer

{youtube}EZGapI7yjh4{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -