Saturday, April 27, 2024
- Advertisement -

నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తున్న స్టార్ హీరో

- Advertisement -

ఒకేసారి నలుగురితో రొమాన్స్ అంటి అని టైటిల్ చూసి కంగారు పడకండి..అసలు విషయం వేరే ఉంది. మమ్ముట్టి కొడుకు..దుల్కర్ సల్మాన్.. మణి రత్నం డైరెక్షన్ లో ఓ కాదల్ కన్మణి మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.

అందరి మనసులో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ లో ఓ మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత చాలా కాలంగా దుల్కర్ తమిళ పరిశ్రమ వైపు చూడలేదు. మరేమైందోగాని అక్కడ అవకాశాలు వచ్చినా కూడా వాటిపైన అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు కుర్రాడు. రీసెంట్ గా ఈ హీరో.. బిజయ్ నంబియార్ డైరెక్షన్ లో సోలో అనే సినిమాకు చేస్తున్నాడు. ఈ మూవీలో ఈ హీరో.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు హీరోయిన్స్ తో సోలో సినిమాలో దుల్కర్ రొమాన్స్ చేస్తున్నారట. అసలు ఒక సినిమాలో ఒకరు లేదా.. ఇద్దరు హీరోయిన్స్ చాలు కానీ ఇతగాడు మాత్రం నలుగురు హీరోయిన్స్ ని పెట్టుకొని వారుతో ఒక ఆట అడేస్తానంటున్నాడు.

మరీ కొంతమంది అసలు ఈ సినిమాకి అంత ప్రత్యేకత ఏముంది?అంతమంది హీరోయిన్స్ అవసరమా అంటే.. కథ ప్రకారం అవసరం కాబట్టే తీసుకున్నాం అని.. చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇక ఆ హీరోయిన్స్ ఎవరంటే.. సాయి ధన్సిక.. నేహాశర్మ.. శృతీ హరిహరన్.. ఆర్తి వెంకటేష్. కథ ప్రకారం నలుగురు హీరోయిన్స్ అవసరం అని దర్శకుడు అంటున్నారు. ఓ కాదల్ కన్మణి సినిమాతో అదరగొట్టిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు నలుగురు హీరోయిన్స్ తో చేస్తున్న ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

https://www.youtube.com/watch?v=iK8bR8KZ6x0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -