Monday, April 29, 2024
- Advertisement -

చ‌దివింది ఇంట‌ర్‌…. విద్యుత్‌ అవసరం లేని ఫ్రిజ్

- Advertisement -

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా కూరగాయల ధరలు నింగికెగశాయి. ఈ నేపథ్యంలో చిన్న కూరగాయ వృథా అయినా ప్రాణం విలవిల్లాడిపోతోంది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను నిలువ చేసేందుకు మ‌నం ఎల‌క్ట్రానిక్ ప్రిజ్‌ల‌ను వాడుతున్నాం.దాని వ‌ల్ల వాటి నాన్య‌త‌కూడా త‌గ్గుతుంది. అవ‌న్నీ కృత్తిమంగా నిల్వ చేస్తాం. పైగా క‌రెంటు ఖ‌ర్చు.
కూరగాయలతోపాటు ఇత‌ర నిత్యావ‌స‌రాల‌ వృథాను అరికట్టేందుకు ఢిల్లీలోని జేడీ గొయాంక పబ్లిక్‌ స్కూల్‌ లో సీనియర్ ఇంటర్ చదువుతున్న దీక్షిత కుల్లార్‌ అనే బాలిక సరికొత్త ఫ్రిడ్జ్ కు రూపకల్పన చేసింది. విద్యుత్ అవసరం లేకుండా కేవలం 4,000 రూపాయల ఖర్చుతో ఈ ఫ్రిడ్జ్ ను తయారు చేసి ఆకట్టుకుంది. పర్యావరణ హితమైన విధానంలో పేదలకు ఉపయోగపడే వస్తువు తయారు చేయాలని ఆలోచించిన దీక్షిత సైన్స్ లోని నిష్క్రియాత్మక ఆవిరి విధానం ద్వారా టెంపరేచర్ స్థిరంగా ఉంచవచ్చని తెలుసుకుంది.
ఇటుకలు, ఇసుక, వెదురు బొంగులు, జనపనార సంచులు ఉపయోగించి ఈ ఫ్రిజ్‌ని రూపొందించింది. ఇటుకలతో దీర్ఘచతురస్రాకార నిర్మాణాన్ని రూపొందించింది. ఇందులో అలాంటిదే మరో చిన్న ఛాంబర్‌ను తయారు చేసింది. వీటి మధ్య ఖాళీని ఇసుకతో నింపింది. ఛాంబర్‌లో పైభాగాన్ని కప్పడానికి వెదురు కర్రలను ఉపయోగించింది. ఈ ఛాంబర్‌లో 120 కేజీల వరకూ కూరగాయాలను నిల్వ ఉంచవచ్చని ఆ విద్యార్థిని పేర్కొంటోంది.
ఈ ప్రిజ్‌లో వారం రోజుల వరకు పాడవకుండా ఉంటాయని చెబుతోంది. ఇందులో ఉష్ణోగ్రత 10-15 డిగ్రీల మధ్య ఉంటుందని ఆమె చెబుతోంది. దీని తయారీకి సుమారు 4,000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపింది. ఈ ఫ్రిడ్జ్ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

https://www.youtube.com/watch?v=keLhKdo8-I8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -