Friday, May 3, 2024
- Advertisement -

స్వ‌రం పెంచిన అఖిల‌…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక నామినేష‌న్ వేయ‌డానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో రాజ‌కీయాలు పీక్ స్టేజికి వెల్లాయి. నిన్న‌టి వ‌ర‌కు సాదార‌నంగా ఉన్న విమ‌ర్శ‌లుఇప్పుడు మ‌రింత వేడెక్కుతున్నాయి.అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురి పాకాన ప‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌ని అఖిల ఇప్పుడు స్వ‌రం పెంచి జ‌గ‌న్‌ను టార్గెట్ చేసింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో విమర్శలు సంచ‌ల‌నంగా మారాయి. వైయస్ అధికారంలో ఉన్నప్పుడు అధికార బలంతో వ్యవస్థలను పతనం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసునని అఖిలప్రియ అన్నారు. అధికారంలో లేకపోయినా అహంకారంతో వ్యవహరిస్తున్న వైయస్ జగన్, ఆయన అనుచరుల తీరుతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని విమర్శించారు.
అహంకారంతో వ్యవహరిస్తున్న జగన్ పార్టీ అధికారంలోకి వస్తే తాము రోడ్ల మీద కూడా తిరగలేమన్న భయం ప్రజల్లో ఉందని అన్నారు. ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఇవ్వకూడదనే నంద్యాల నియోజకవర్గం ప్రజలు నిశ్చయించుకున్నారని అఖిలప్రియ తెలిపారు.
జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సరైన సమయం ఇదేనని అఖిలప్రియ అన్నారు. జలయజ్ఞాన్ని ధన యజ్ఞం చేసి ప్రాజెక్టులు కట్టకుండా మట్టి పనుల ద్వారా వైయస్ రూ.వేల కోట్లు దండుకున్న వైనం ప్రజలందరికీ తెలుసునని అఖిలప్రియ చెప్పారు.
గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు అందించి, కృష్ణా నీటిలో ఏపీ వాటాను సీమకు తరలించాలని దృఢ సంకల్పంతో చంద్రబాబు ఉన్నారని, అందుకే చంద్రబాబును ప్రజలు ఆదరిస్తున్నారని అఖిలప్రియ చెప్పారు. ఓటమి భయంలో ఉన్న జగన్ పార్టీ.. డబ్బుల సంచులతో గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతోందని అఖిలప్రియ సంచలన ఆరోపించారు.వైసీపీలో ఉన్న‌ప్పుడు ఇవ‌న్నీ గుర్తుకు రాలేదేమొ అఖిల‌ప్రియ‌కు.

https://www.youtube.com/watch?v=v8ed1s5VycM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -