Wednesday, May 1, 2024
- Advertisement -

నితిన్ ఈజ్ బ్యాక్!

- Advertisement -

వక్కంతం వంశీ దర్శకత్వలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్. నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించగా డిసెంబర్ 8 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ -రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సహకారంతో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి – నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నా పేరు సూర్య లాంటి యాక్షన్ సినిమాను తెరకెక్కించిన వక్కంతం వంశీ కంప్లీట్ తన జోనర్‌కు భిన్నంగా ఈ సినిమాకు తెరకెక్కించారు. ఇవాళ రిలీజైన ట్రైలర్‌ని చూస్తే ఈ మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ట్రైలర్‌లో నితిన్ నటన చూస్తే అద్భుతంగా ఉంది. డైలాగ్స్ లో ఫ‌న్, ఫ్యామిలీతో ఎపిసోడ్స్ లో నిజంగా ఎక్స్ ట్రార్డిన‌రీ మ్యాన్‌గానే కనిపించాడు.

చిన్న త‌నం నుంచి అత‌డు పెరిగిన తీరు వేరు, ప్ర‌తి ఫ్రేమ్‌లోను వెన‌కాలే ఉండటం వంటివి చూస్తుంటే కంప్లీట్ కామెడీ, ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమా వస్తున్నట్లు అర్థమవుతోంది. శ్రీలీల‌తో నితిన్ ఫ‌న్ ఎపిసోడ్స్ బాగుండగా ట్రైల‌ర్ చివ‌రిలో ఖైదీగా సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్ ఎంట్రీ అదిరిపోయింది. మీరు ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -