అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ వంగా. తొలి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించారు సందీప్. తర్వాత అదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసి హౌరా అనిపించుకున్నారు. ఇక తన రెండో సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు సందీప్.
రణబీర్, రష్మికా హీరో, హీరోయిన్లుగా యానిమల్ సినిమాను తెరకెక్కించగా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఇక ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా మహేష్‌తో సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రణ్‌బీర్. వాస్తవానికి యానిమల్ కంటే ముందు మహేష్ బాబుక డెవిల్ కథ వినిపించానని అయితే అది యానిమల్ కంటే వయలెంట్‌గా ఉండటంతో ఆ ప్రాజెక్టు కుదరలేదన్నారు. దీంతో సందీప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
