భారీ వ‌సూళ్లు సాధించి షాకిచ్చిన ఎఫ్ -2

ఎఫ్ -2 సినిమా ఈ సంక్రాంతికి విడుద‌ల అయి సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌లో హీరోలుగా న‌టించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హారించాడు.ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా సంక్రాంతి విజేత‌గా నిలిచింది. ఇటు వెంకీ కెరీర్‌తో పాటు,అటు వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో కూడా అతి పెద్ద హిట్‌గా నిలిచింది ఎఫ్ -2 సినిమా. సినిమా మొద‌టి రెండు వారాల‌లోనే 100 కోట్లు సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తాజాగా ఈ సినిమా 140 కోట్ల గ్రాస్‌ను అందుకున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కొద్ది రోజులు క్రిత‌మే ఈ సినిమాను అమెజ‌న్ ప్రైమ్‌లో విడుద‌ల చేశారు. అయిన‌ప్ప‌టికి కూడా ఈ సినిమా కొన్ని థియోట‌ర్స్‌లో సంద‌డి చేస్తునే ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా త‌మ‌న్నా,మెహ్రీన్‌లు న‌టించారు.