- Advertisement -

స్టార్ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన‌ ర‌ష్మిక మంద‌నా

- Advertisement -

ఛ‌లో సినిమాతో తెలుగు ప‌రిచియం అయింది ర‌ష్మిక మంద‌నా. తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా త‌రువాత టాలీవుడ్ సన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి గీతా గోవిందం సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో ర‌ష్మిక న‌ట‌న‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో గీతాగా న‌టించిన ర‌ష్మిక‌కు త‌రువాత తెలుగులో మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇక న్యాచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి దేవ‌దాస్ సినిమాలో క‌నిపించింది. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో తెలుగులో హ్యాట్రిక్ సాధించిన హీరోయిన్‌గా నిలిచింది ర‌ష్మిక. తాజాగా ఈభామ‌కు త‌మిళంలో ఓ స్టార్ హీరోతో న‌టించే అవ‌కాశం ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది. హీరో కార్తితో రొమాన్స్‌కు ర‌ష్మిక రెడీ అవుతుంద‌ని తెలుస్తోంది. భాగ్యరాజ్ కన్నన్ ద‌ర్శక‌త్వంలో కార్తి ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా ర‌ష్మిక‌ను ఎంపిక చేశార‌ని తెలుస్తోంది.భాగ్యరాజ్ కన్నన్ గ‌తంలో రెమో సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి అఫిష‌య‌ల్ అనౌన్స్‌మెంట్ విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -