Sunday, May 5, 2024
- Advertisement -

టీడీపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి..

- Advertisement -

ఎన్నిక‌ల వేల టీడీపీలో కూడా చేరిక‌లు బాగానే పెరుగుతున్నాయి. అవి వైసీపీనుంచి కాకుండా కాంగ్రెస్ నెంచి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. వ‌ల‌స‌ల‌తో పాటు పార్టీలో అస‌మ్మ‌తి ఎక్క‌వ అవుతోంది. తాజాగా కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర‌దేవ్ బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా చంద్రదేవ్ తో పాటు విశాఖ జిల్లాకు చెందిన పలువురు వైసీపీ, కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి… ఆహ్వానించారు.కేంద్రంలో బీజేపీని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందనీ… అందుకు తెలుగు దేశం పార్టీయే సరైన వేదిక అని నిర్ణయించుకున్నానని తెలిపారు. జిల్లాలోని అశోక్‌గజపతిరాజుతో కలిసి పనిచేస్తానని చంద్రదేవ్ స్పష్టం చేశారు.

ఆయ‌న చేరిక‌తో అశోక్ గ‌జ‌ప‌తిరాజు అసంతృప్తిగా ఉన్నారు. గ‌తంలోనే కిశోర్ చంద్ర‌దేవ్ రాక‌ను వ్య‌తిరేకించిన ఆశోక్ గ‌జ‌ప‌తి రాజు…బాబు న‌చ్చ‌జెప్ప‌డంతో …చంద్రదేవ్ టీడీపీలో చేరితే స్వాగతిస్తానని, ఆయన చేరికపై ఎలాంటి అభ్యంతరం లేదని అశోక్ గజపతిరాజు చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. తాజాగా ఉండవల్లిలో చేరిన ఈ కార్యక్రమానికి అశోక్ గజపతి రాజు గైర్హాజరు కావడంతో మళ్లీ రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి

ఐదుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర గిరిజన వ్యవహరాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -