తమ ఫన్ అండ్ ఫ్రెస్టేషన్‌తో ఈ సంక్రాంతికి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎఫ్2 మూవీ .. వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. వెంకటేష్, వరుణ్ తేజ్ లీడ్ రోల్స్‌లో అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. కేవలం రెండు వారాల్లో వందకోట్ల క్లబ్‌లో చేరిపోయి.. బొమ్మ బ్లాక్ బాస్టర్ అనిపించింది.
తెలంగాణ స్లాంగ్‌లో వరుణ్‌తేజ్… నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి తర్వాత తనలోని కామెడీ యాంగిల్‌ని చూపించిన వెంకటేష్… ఈ ఇద్దరు కోబ్రాస్ చేసిన కామెడీకి ప్రేక్షకులు మస్త్ ఖుషీ అయ్యారు. అంతేగా అంతేగా అంటూ.. హీరోలిద్దరూ చేసే మేనరిజం చేసిన మ్యాజిక్‌కు రిజల్ట్.. రెండు వారాల్లో మూవీకి వందకోట్ల క్లబ్‌లో చోటు దక్కడమే. మూవీ సక్సెస్‌ను చూసిన చిత్ర నిర్మాణ సంస్థ.. వచ్చే సంక్రాంతికి ఎఫ్2కు సిక్వేల్ తీసుకొస్తామని ఇప్పటికే అనౌన్స్ చేసింది. మా సినిమా ని ఇంత ఘనవిజయం చేసిన తెలుగు అభిమానులు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్‌లో ఓ ట్వీట్ చేసింది.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!