Saturday, April 27, 2024
- Advertisement -

రాజా రవితేజతో అనిల్ రావిపూడి!

- Advertisement -

ఒకరేమో సక్సెస్ ఫుల్ డైరెక్టర్…మరొకరేమో సక్సెఫుల్ హీరో. వీరిద్దరి కాంబోలో మరోసారి సినిమా రానుంది. అదే ఒకరు హీరో రవితేజ కాగా మరొకరు అనిల్ రావిపూడి. రవితేజ రీసెంట్‌గా టైగర్ నాగేశ్వరరావుతో హిట్ కొట్టగా అనిల్ రావిపూడి వరుస బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలతో మంచి జోష్ మీదున్నారు. బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాతో బాలయ్యకు బ్లాక్ బాస్టర్ హిట్‌ని అందించగా రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇక తాజాగా భగవంత్ కేసరి సినిమా తర్వాత తన తర్వాతి ప్రాజెక్టును రవితేజతో చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ బ్లాక్ బాస్టర్ హిట్ కాగా మళ్లీ అలాంటి కథనే రవితేజతో సిద్ధం చేశారట.

ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే టైగర్ సినిమాతో జోష్ మీదున్న రవితేజ….అనిల్‌తో మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -