Sunday, May 5, 2024
- Advertisement -

చెన్నై కథా నాయకి,

- Advertisement -

చెన్నై సుందరి త్రిష రొటీన్ గా రొమాన్స్ ఏం చేస్తాం అంటోంది. చేస్తే గీస్తే…. అంతకు మించి మరొకటి చేయాలంటోంది. దానిలో బాగంగా తనది కాని రూట్ ను ఎంచుకుంది. అదే హార‌ర్ కామెడీ.

కోలీవుడ్‌లో ఈ మ‌ధ్య ప్ర‌తి ఒక్క చిన్న‌ది హార‌ర్ కామెడీ అంటే ప‌డి చ‌చ్చిపోతోంది. దానికి కార‌ణం ఆ సినిమాల‌కు అక్క‌డ ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉండ‌డ‌మే. గోవి డైరెక్ష‌న్లో తెర‌కెక్కుతోన్న ఈసినిమాలో త్రిష రొమాంటిక్, హార‌ర్ ట‌చ్ ఇవ్వ‌బోతోంది.

ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ కూడా వ‌చ్చిన ఈ సినిమా పోస్ట‌ర్ జ‌నాల‌కు కొంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంది. అయితే సినిమా వ‌చ్చాక ఎంత వ‌ర‌కూ ప్రేక్ష‌కుల‌ను లారెన్స్ సినిమాల మాదిరిగా థ్రిల్ చేస్తుంద‌న్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ల‌క్ష్మీరాయ్ ,ఆండ్రియా,తాప్సీ లాంటివారు ఇప్ప‌టికే ఈ జోన‌ర్లో స‌క్సెస్ అయిన‌వారు. మ‌రి రేపు ఆ స‌క్సెస్ ను త్రిష కూడా అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి. అన్న‌ట్టు త్రిష చేస్తోన్న ఆ హార‌ర్ కామెడీ తెలుగు,త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతోంది. ఆ బొమ్మ పేరు నాయ‌కి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -