విశ్వక్ ముందు బాగా వీక్ అయిపోయిన సూర్య!

- Advertisement -

తమిళ స్టార్ హీరోలు అందరిలో సూర్య కి రజనీకాంత్ తర్వాత తెలుగు లో పెద్ద మార్కెట్ ఉంది. సూర్య సినిమా తెలుగు లో విడుదల అయితుంది అంటే తెలుగు లో ని చాలా మంది హీరోలకన్నా బెటర్ రిలీజ్ ఉంటుంది. అప్పుడెప్పుడో ఘజిని సినిమా విజయం సాదించినప్పటి నుంచి సూర్య కి తిరుగు లేకుండా పోయింది తెలుగు లో. మధ్యలో సింగం సినిమా కూడా సూర్య మార్కెట్ ని అమాంతం పెంచేసింది. తెలుగు ప్రేక్షకులు సూర్య ని ఎంత లా ఓన్ చేసుకున్నారు అంటే కొన్ని సార్లు సూర్య సినిమా లు తమిళం లో పెద్దగా ఆడకపోయినా కానీ తెలుగు లో మాత్రం పెద్ద విజయం సాధించాయి.

అయితే తాజాగా సూర్య ఎన్జీకె అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు. సూర్య, రకుల్ ప్రీత్ మరియు సాయి పల్లవి కలిసి నటించారు ఈ సినిమా లో. సెల్వ రాఘవన్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకుల ని పెద్ద ఎత్తున నిరాశ కి గురి చేసింది అని తెలుస్తుంది.

- Advertisement -

అయితే అదే రోజున ఎవరో కూడా తెలియని అటువంటి విశ్వక్సేన్ నటించిన ఫలక్నుమా దాస్ సినిమా మాత్రం పెద్ద ఎత్తున విజయం సాధించింది. సూర్య సినిమా కన్నా ఎక్కవ వసూళ్లు రాబట్టిన సంతోషం లో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి, “నా సినిమా ఈ వీకెండ్ లో పెద్ద గ్రాసర్” అనే విషయాన్నీ కూడా చెప్పాడు.

సూర్య త్వరగా కోలుకొని జాగ్రత్త పడకపోతే త్వరలో భారీగా నష్టపోయే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -