Friday, May 3, 2024
- Advertisement -

పవన్‌కి, పవన్ అభిమానులకు ఓ పవన్ అభిమాని ఆవేధనతో రాసిన లేఖ

- Advertisement -

అజ్ఙాతవాసి సినిమా రిలీజ్‌కి కొన్ని వారాల ముందు నుంచీ కూడా ఒక వ్యూహం ప్రకారం పవన్ ఇమేజ్ డ్యామేజ్ చేయడం ప్రారంభమైంది. ఇక అజ్ఙాతవాసి రిలీజ్ రోజు అయితే పనిగట్టుకుని మరీ కుట్రపన్ని సినిమాను కిల్ చేశారన్నది నిజం. ఈ మొత్తం తతంగం నడిపించింది ఎవరు? రాజకీయ వ్యూహం ఎవరిది?
ఈ మొత్తం కుట్ర అంతా వైకాపాదే అని విమర్శలు చేస్తున్న వాళ్ళ వాదన కరెక్టే అనుకుందాం. అయితే ఆ వాదన చేస్తున్నవాళ్ళు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

2014లో ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ కళ్యాణ్ రాజకీయం చేశాడు. ఒకవేళ ఈ మొత్తం వ్యవహారం వెనకాల వైకాపానే గనుక ఉండి ఉంటే సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాల విషయంలో ఇలా ఎందుకు జరగలేదు? ఆ రెండు సినిమాలు అజ్ఙాతవాసికంటే చాలా బ్యాడ్ సినిమాలు అన్న నిజం ఎవరైనా ఒప్పుకుంటారుగా. మరి సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడులాంటి బ్యాడ్ సినిమాల విషయంలో కూడా రాని అత్యంత వరస్ట్ స్పందన అజ్ఙాతవాసికి ఎందుకొచ్చింది? ఇక మహేష్ కత్తిని ఎంకరేజ్ చేసిన మీడియా ఛానల్స్ ఎవరివి? ఆ మీడియా ఛానల్స్ ఎవరి భజన కోసం ఉన్నాయి? ఆ మీడియా ఛానల్స్‌ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్న ముఖ్య అధికార శక్తి ఎవరు? ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి మీడియాను మినహాయిస్తే జగన్‌కి సపోర్ట్‌గా ఒక్క మీడియా సంస్థ కూడా లేదన్నది నిజం. ఇక వెబ్‌సైట్స్ కూడా జగన్‌కి పూర్తిగా మద్దతిచ్చేవి లేవు. జగన్‌కి కాస్తో కూస్తో మద్దతిచ్చేవి కూడా అవసరమైతే వ్యూస్ కోసం జగన్ వ్యతిరేక వార్తలు, జగన్‌కి నష్టం చేసే వార్తలు ప్రచురించడానికి రెడీగా ఉండేవే. అదే చంద్రబాబు విషయానికి వస్తే బాబుకు గానీ, లోకేష్‌కి గానీ కనీసం ఒక్క వార్త కూడా వ్యతిరేకంగా రాయకుండా, అన్నీ కూడా చంద్రబాబుకు ప్లస్ అయ్యేలా వ్యూహాలు రచించి మరీ వార్తలు రాస్తున్నవే.

పవన్‌కి వ్యతిరేకంగా చంద్రబాబు మీడియా సంస్థల్లో ఎందుకు వార్తలు వస్తున్నాయి? ఆ మధ్య నారా లోకేష్ ఫారెన్ అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటపడితే ఇప్పుడు మహేష్ కత్తిని స్టూడియోల్లో గంటలు గంటలు కూర్చోబెడుతున్న ఛానల్స్ ఏవీ కూడా అప్పుడు చర్చలు పెట్టలేదే. అన్నింటికీ మించి రోజాతో సహా వైకాపా నేతలు ఎవ్వరైనా గత 20రోజుల హంగామాలో ఏనాడైనా పవన్ విషయంపై స్పందించారా? పవన్-మహేష్ కత్తి ఇష్యూ మొత్తం చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని తెలుసుకున్న జగన్ తన పార్టీ నేతలెవ్వరూ కూడా అస్సలు స్పందించవద్దని ఆదేశాలు పంపాడన్నది నిజం.

పవన్‌కి ఇప్పటికైనా పచ్చ వ్యూహాలు అర్థమవుతున్నాయో లేదో కానీ ఒకవైపు అజ్ఙాతవాసి సినిమాకు సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఎక్ట్స్రా షోలకు అవకాశమిస్తూ మరోవైపు బాలయ్య సినిమా కోసం అజ్ఙాతవాసి సినిమాను కిల్ చేసే ప్రయత్నం ఘనంగా జరిగింది. అజ్ఙాతవాసి సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకు బాలయ్య సినిమా వస్తుండడంతో అజ్ఙాతవాసి హంగామా కేవలం రెండు రోజులకే ముగిసిపోవాలని కుట్రలు పన్ని అజ్ఙాతవాసి అట్టర్ ఫ్లాప్ అన్న మెస్సేజ్‌లతో సోషల్ మీడియాను ముంచెత్తారన్నది నిజం. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ సినిమాను కూడా ఇలాగే చంపేశారు. ఇప్పుడు పవన్‌కి కూడా అవే చుక్కలు చూపించారు.
ఇక రాజకీయంగా కూడా పవన్ ఇమేజ్‌పై దారుణమైన దెబ్బకొట్టారు. అన్నింటి వెనుకా అసలు వ్యూహం ఒక్కటే. 2019లో ఆంద్రప్రదేశ్‌లో ఉన్న అన్ని సీట్లలో పవన్‌కి పోటీ చేసే సామర్థ్యం లేకుండా చేయడం……జగన్ పార్టీకి పవన్‌ని, ఆయన ఫ్యాన్స్‌ని పూర్తిగా వ్యతిరేకంగా మార్చడం…….పవన్‌కి ప్రత్యామ్నాయాలు ఏమీ లేకుండా చేసి కచ్చితంగా టిడిపితో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి కల్పించి……..అప్పుడు ఓ పది పన్నెండు సీట్లు పడేసి…..జనసేనను టిడిపికి సామంత పార్టీగా మార్చేయడం…….

గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించడండి పవన్‌గారు……భజన మీడియాను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నవాళ్ళ పద్మవ్యూహం సులభంగానే అర్థమవుతుంది. అప్పుడు కూడా అసలు నాయకుడు మాత్రం చివరి వరకూ ఎన్టీఆర్‌కి మిత్రుడుగానే నటించాడు…….నడపాల్సిన రాజకీయ కుట్రలన్నీ నడిపాక చివరగా ముఖ్యమంత్రి కుర్చీని లాగేసుకునే టైంలో మాత్రమే బయటపడ్డాడు. పైకి ఒకలా కనపడడం…….తెరవెనుక మరోలా కథ నడపడం ఆ నాయకుడికి వెన్నుపోటుతో పెట్టిన విద్య పవన్ కళ్యాణ్‌గారు…….రాజకీయ వ్యూహాలు అర్థమవుతున్నాయా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -