Sunday, April 28, 2024
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీతో హార్దిక్ పాండ్య డేటింగ్‌

- Advertisement -

క్రికెట్‌కు, సినీ ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య ఓ మంచి అనుబంధం ఉంది. వీటి మ‌ధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి. కోహ్లీ, జ‌హీర్‌ఖాన్ స‌ర‌స‌న ఇప్పుడు హార్దిక్ పాండ్య కూడా చేర‌బోతున్నాడు. మొన్న భార‌త‌ క్రికెట్ ఆట‌గాడు జ‌హీర్‌ఖాన్‌, బాలీవుడ్ న‌టి సాగ‌రిక‌ను వివాహ‌మాడాడు. భార‌త క్రికెట్ జ‌ట్టు విరాట్ కోహ్లీ, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ జంట ఇప్పుడు పెళ్లి చేసుకొని వివాహా జీవితం ఎంజాయ్ చేస్తున్నారు. అదే బాట‌లో భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య చేర‌నున్నాడు. ఓ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడ‌ని తెలుస్తోంది.

గ‌తంలో వేరేవారితో డేటింగ్‌లో ఉంద‌ని అప్పుడు పుకార్లు వినిపించాయి. ఇప్పుడు ఈ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా పాండ్య బాలీవుడ్‌ భామతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి వార్తలు బ‌లం చేకూరింది. స్విస్‌ బ్యూటీ ఎల్లి అవ్‌రామ్‌తో పాండ్య స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నాడ‌ని స‌మాచారం. గతేడాది డిసెంబర్‌లో హార్దిక్‌ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ఎల్లి హాజరయ్యింది. దీంతో ఆమెతో డేటింగ్‌ వార్తలు మరింత వూపందుకున్నాయి. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎల్లి.. బిగ్‌బాస్‌-7‌ సిరీస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. మిక్కీ వైరస్‌,కిస్‌ కిస్కో ప్యార్‌ కరూన్‌, నామ్‌ షబానా, పోస్టర్‌ బాయ్స్‌లోనూ ఎల్లి న‌టించింది. ఈ ఏడాది తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -