Sunday, April 28, 2024
- Advertisement -

`అజ్ఞాత‌వాసి`ని చూసిన ప‌వ‌న్ కోడ‌లు

- Advertisement -

`అజ్ఞాతవాసి` సినిమాను ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోడ‌లు చూశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోడ‌లు ఎవ‌రూ అనుకుంటున్నారా? అదేనండి చిరంజీవి త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌. చిరంజీవికి కోడ‌లు అయిన‌ప్పుడు ప‌వ‌న్‌కు కూడా కోడలే క‌దా. ఉపాస‌న సినిమా చూడ‌డానికి త‌న భ‌ర్త రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశాడంట‌. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఉపాస‌న కోసం ప్ర‌త్యేక షో ఏర్పాటుచేయించాడంట‌. రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. సినిమా తారలు కూడా స్పెషల్ షో వేయించుకొని మరి సినిమా చూశారు.

మెగా ఫ్యామిలీలో కూడా అందరూ సినిమాను చూశారని టాక్ వినిపిస్తోంది. ఇక వారందరి కంటే స్పెషల్ గా చరణ్ దంపతులు ముందే చూసేశారట. ఆ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఓ పని మీద అమెరికా వెళ్లిన ఉపాసనకు చరణ్ అజ్ఞాతవాసి షోని చూపించాడని ఉపాస‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోస్ట‌ర్‌ను ఉపాసన పోస్ట్ చేశారు. కొణిదెల మ్యాజిక్ అని కామెంట్ చేసింది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -