Saturday, May 11, 2024
- Advertisement -

అజిత్‌ని కారును వెంబ‌డించిన వ్య‌క్తి ..!

- Advertisement -

హీరో అజిత్‌ను అభిమానులు త‌లైవ‌గా ముద్దుగా పిలుచుకుంటారు.తాజాగా హీరో అజిత్‌కు ఎదురైన ఓ సంఘ‌ట‌న‌ బ‌య‌టికి వ‌చ్చింది.ఇటీవల అజిత్ ఎయిర్ పోర్ట్ నుండి తన కారులో బయలుదేరాడు.అయితే ఓ వ్య‌క్తి అజిత్‌ను ఫాలో అవుతు వ‌చ్చాడట‌.అజిత్ ని వెంబడిస్తూ దాదాపు 18 కిలోమీటర్ల వరకు వెళ్లాడట ఆ వ్య‌క్తి.ఇది గ‌మ‌నించిన అజిత్ రోడ్డు మధ్యలోనే కారు ఆపి సదరు అభిమానిని పిలిచి మాట్లాడాడు. ముందు తానెవరో అజిత్ కి పరిచయం చేసుకున్న తరువాత.. గతంలో మూడు సార్లు మిమ్మల్ని కలిసానని కానీ ఫోటో తీసుకోవడం కుదరలేదని అందుకే ఫాలో అవుతూ వచ్చానని వెల్లడించాడు.

అది విన్న అజిత్ ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించవద్దని చెప్పి సదరు అభిమాని కోరిక ప్రకారం ఫోటో దిగి పంపించాడట. మీకు ఏమైన అయితే నాకు బాధ క‌లుగుతుంద‌ని అత‌నికి చెప్పి అక్క‌డ నుంచి వెళ్లిపోయార‌ట అజిత్‌.ఈ ఘ‌ట‌న బ‌య‌ట‌కి వ‌చ్చిన దగ్గ‌ర నుంచి అజిత్ అభిమానులు త‌మ హీరో గురించి గొప్ప‌గా చెప్పుకుంటు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -