Monday, April 29, 2024
- Advertisement -

మ‌హా కూట‌మికి రెబ‌ల్స్ షాక్‌….

- Advertisement -

మ‌హాకూట‌మికి రెబ‌ల్స్ షాక్ ఇస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలు అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌డంతో టికెట్ రాని కొంద‌రు నేత‌లు రాజీనామాలు చేయ‌డంతోపాటు మ‌రి కొంద‌రు రెబ‌ల్స్‌గా పోటీ చేస్తున్నారు. జాబితాను సిద్ధం చేయడానికి ముందుగానే అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు ఎంతగానో ప్రయత్నించిన కాంగ్రెస్, టీడీపీలు … వారిని పూర్తిస్థాయిలో సంతృప్తి పరచడంలో సక్సెస్ కాలేకపోయిందని తెలుస్తోంది.

రెబ‌ల్స్ జాబితా పెద్ద‌గా ఉండ‌టంతో కూట‌మికి చెమ‌లు ప‌డుఉతున్నాయి. కాంగ్రెస్ తరపున వరంగల్ వెస్ట్ టికెట్ ఆశించిన నాయిని రాజేందర్ రెడ్డి… ఇక్కడ నుంచి టీడీపీ తరపున రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని తెలియడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెబుతున్నా… ఆయన రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇక స్టేషన్ ఘన్ పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీమంత్ర విజయరామారావు కాంగ్రెస్ రెబల్ గా బరిలో ఉండబోతున్నట్టు ప్రకటించారు. శేరిలింగంపల్లి నుంచి రెబల్ ‌గా బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ క్రిశాంత్ సైతం పోటీకి సై అంటున్నారు.

అటు టీడీపీకీ కూడా భారీ షాక్ త‌గిలింది. పొత్తులో భాగంగా క‌హేశ్ర‌రం టికెట్ కాంగ్రెస్‌కు ద‌క్క‌డంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నా టీడీపీ మహేశ్వరం మండల అధ్యక్షుడు కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. త్వ‌ర‌లోనే భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారు. మ‌రో నేత బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌కూడా రెబ‌ల్స్‌గా పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.

కాంగ్రెస్ తరపున మంచిర్యాల టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, దుబ్బాకకు చెందిన ముత్యం శ్రీనివాసరెడ్డి, జడ్చర్లకు చెందిన అనిరుద్ రెడ్డి, బాన్సువాడకు చెందిన మాల్యాద్రి రెడ్డి, ఆలేరుకు చెందిన రాంచందర్ రెడ్డి మహాకూటమి తరపున రెబల్స్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -