Friday, May 17, 2024
- Advertisement -

ఒత్తిడంతా మా జ‌ట్టుపైనే ఉంది…ఆసిస్ కెప్టెన్‌

- Advertisement -

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిస్థితి నానాటికీ తీసికట్టులాగా తయారవుతున్నది. ఏండ్లకు ఏండ్లు క్రికెట్ ప్రపంచాన్ని కింగ్‌లా ఏలిన ఆసీస్..ప్రస్తుతం వరుస ఓటములతో కునారిల్లుతున్నది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో 13 మ్యాచ్‌లాడిన కంగారూలు కేవలం మూడు విజయాలకు పరిమితమయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.

సొంతగడ్డపై ఇటీవల మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడిన ఆసీస్ జట్టు 1-2 తేడాతో సిరీస్‌ని చేజార్చుకుంది. సిరీస్ సాంతం ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తూ వెళ్లడంతో.. ఏ బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణింలేకపోయారు.జ‌ట్టులో మార్పులు చేసినా ఆట‌తీరులో పురోగ‌తి లేద‌ని కెప్టెన్ పించ్ ఆసంతృప్తి వ్య‌క్తం చేశారు.

మరోవైపు భారత్ జట్టు ఈనెల 21 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ కోసం అక్కడికి వెళ్తోంది. ‘దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న తర్వాత మా టీమ్ పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒత్తిడంతా మా జ‌ట్టుపైనే ఉంద‌ని..భార‌త్‌తో సిరీస్ అంత ఈజీ కాద‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -