- Advertisement -

అదొక్కటే సరిపోదు తేజూ

- Advertisement -

హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ మాస్ ఇమేజ్ కోసం ఎప్ప‌టీనుండో ప్ర‌యత్నలు చేస్తున్న‌ప్ప‌టికి హిట్ మాత్రం దక్క‌డం లేదు.మెగా మేన‌ల్లుడు క‌దా అవ‌కాశాలు వ‌స్తునే ఉన్నాయి. సాయి ధ‌ర‌మ్ తేజ్ చివ‌రి నాలుగు సినిమాలు బాక్స్‌ఫిస్ ద‌గ్గ‌ర ఘోరంగా ఫెయిల్ అయ్యాయి.అదే మ‌రో హీరోకి అయితే పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌చ్చు కానీ.. ఇక్క‌డ మెగా కాంపోడ్ నుండి సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు స‌పోర్ట్ ఉండ‌టంతో పెద్ద ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర ప‌ని చేసే అవ‌కాశం ద‌క్కింది.ఇక తేజు విష‌యానికి వ‌స్తే తన ప్రతి సినిమాలోనూ మేనమామల రిఫరెన్స్‌ ఏదో ఒక రూపంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌.

తాజాగా ‘ఇంటిలిజెంట్‌’ సినిమాలో అయితే అచ్చం మెగాస్టార్‌ చిరంజీవిని దించేసేలా డాన్సులు, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ని తలపించే అప్పీయరెన్స్‌ వంటివన్నీ వుండేలా జాగ్రత్తపడ్డాడు. ‘ఎంతైనా మెగా మేనల్లుడు కదా, ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయ్‌. కావాలని తేజూ అవన్నీ చేయడు’ అని వినాయక్‌ చెప్పినా, వాస్తవం ఏంటో ‘ఇంటిలిజెంట్‌’ ట్రైలర్‌ చూస్తే అర్థమయిపోతుంది. అందుకే ఇప్పుడు ‘ఇంటిలిజెంట్‌’తో తేజు కొత్తగా ట్రై చేసి తీరాల్సిందే. వినాయక్‌ అంటే మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ని తెరకెక్కించడంలో దిట్ట. కాబట్టి ఈసారి తనకు కమర్షియల్‌ హిట్‌ పక్కాగా దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నాడు తేజూ. సాంగ్‌ ప్రోమోస్‌లో తేజూ డాన్సులు, ఆ పాటల్లో తేజూ సరసన నటించిన అందాల భామ లావణ్య త్రిపాటి గ్లామర్‌ సొగసులు బాగానే హైలైట్‌ అవుతున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -