Saturday, May 18, 2024
- Advertisement -

అందరూ అనుకున్నట్టుగానే……. డ్రామా సుఖాంతం….. కేంద్రం నుంచి ఫోన్ అనడమే కామెడీ

- Advertisement -

మూడున్నరేళ్ళుగా చూస్తున్న డ్రామానే…… కొత్తగా ఏమీ లేదు…… అంతా పాత కథే…… భజన బ్యాచ్ ప్రధాన పాత్రదారుడు పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్‌లాగే ‘అంతా సేం టు సేం’. ప్రత్యేక హోదా ఇష్యూ నుంచి ఇప్పటి వరకూ జరిగిన తంతే ఈ సారీ జరిగింది. బాబు ఆవేశం, బాబు ఆగ్రహం, బాబు రంకెలు, బాబు ఉరుములు, బాబు మెరుపులు అని పచ్చ మీడియా పిచ్చ హంగామా చేయడం…… ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో రగిలిన వేడి కాస్త చల్లారేవరకూ ఎంపిలు తాటాకు చప్పుళ్ళు చేయడం……. ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా ఢిల్లీ నుంచి బాబుకు రాయబారం, అన్నీ చేస్తామన్నారు, బాబు ఆగ్రహంగా స్పందించాడు, అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాలని పక్కనున్నవాళ్ళు చెప్పారు, ఆ తర్వాత ప్రజల కోసం బాబు చల్లబడ్డాడు.

గత మూడున్నరేళ్ళుగా ఈ రియల్ లైఫ్ పచ్చ డ్రామా ప్రారంభం, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇదే. ప్రజలకు ఈ డ్రామా ఎప్పుడో తెలిసిపోయింది. అందుకే ఈ సారి ఇంకాస్త బలం చేకూరుస్తూ కేంద్రం నుంచి కనీసం పది మంది నుంచీ వరుసగా ఫోన్స్ వచ్చినట్టుగా రసవత్తరంగా నడిపించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అధికారికంగా జరిగిన విషయం ఒక్కటి కూడా ఎవరికీ తెలియదు కాబట్టి అంతా పెరుమాళ్ళకెరుక అనుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ రోజు నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాబట్టి ఆయన స్పందన నిజమో కాదో ఎలా తెలుస్తుంది? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఎపిసోడ్, రాష్ట్ర విభజన ఎపిసోడ్, మోడీని తలకెత్తుకోమని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చెప్పిన ఎపిసోడ్‌లో తమ రాతలతో సీమాంధ్రప్రజలను నిండా ముంచిన, ఇప్పటికీ ముంచుతున్న పచ్చ మీడియా రాతలను నమ్మడమంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎవ్వరూ కాపాడలేరన్నట్టే. మీడియా విషయం పక్కన పెట్టినా ప్రతి రోజూ ఒక్కసారైనా మీడియాతో మాట్లాడకుండా, మీడియాలో కనిపించకుండా ఉండలేని చంద్రబాబు బడ్జెట్ రోజు నుంచీ అస్సలు మీడియా ముందుకే రాకపోవడానికి కారణం ఏంటో?

ఈ డ్రామా విషయం పక్కనపెడితే ఈ సారి బిజెపి బెదిరింపులు కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. సోమూ వీర్రాజు అయితే చంద్రబాబు అవినీతి చరిత్ర మొత్తం వినిపించాడు. రెండెకరాలే నేత కోట్లాది రూపాయల అధినేత వైనాన్ని ప్రస్తావించాడు. అలాగే ‘మహానేతను భూస్థాపితం చేసి’ అంటూ సోమూ వీర్రాజు మాట్లాడిన కొన్ని నిమిషాల్లోనే టిడిపి ఎంపి, బాబు అనుంగు మిత్రుడు సుజనా చౌదరి మీడియా ముందుకు వచ్చి……..‘అబ్బే ఏమీ లేదు……విడిపోవడం లేదు, రెగ్యులర్ మీటింగ్, రొటీన్‌లో భాగమే ఇది’ అని చెప్పడం అయితే లీడర్ సినిమాలో డైలాగ్స్ గుర్తుకు తెచ్చాయి. ’మహానేతను భూస్థాపితం చేసి‘ అన్న డైలాగ్‌తో గతాన్ని మొత్తం తవ్వితీస్తాం……నిజాలు బయటపెడతాం అనే స్థాయి బెదిరింపులకు కూడా బిజెపి రెడీ అయిపోవడంతో పచ్చ బ్యాచ్ వెన్నులో వణుకు మొదలయిందన్న విశ్లేషణ అయితే సీనియర్ జర్నలిస్టులు చెప్తూ ఉండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -