Saturday, May 18, 2024
- Advertisement -

మహేష్ తో విజయశాంతి తో డాన్స్ చేయించాలట

- Advertisement -

అనిల్ రావిపూడి దర్సకత్వం లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవరు. రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ సినిమా లో నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు ముఖ్య పాత్ర లు పోషిస్తుండగా, విజయశాంతి ఈ సినిమా తో తన రెండో ఇన్నింగ్స్ ని ఆరంభిస్తున్నారు. అంతే కాకుండా బండ్ల గణేష్ కూడా ఈ సినిమా తో ఒక మంచి పాత్ర తో మళ్ళీ మన ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి మొదటి సారి ఒక పెద్ద హీరో తో పని చేస్తూ ఉండటం చాలా ఆనందం కలిగించే అంశం. అయితే ఈ సినిమా బాగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. మహేష్ అభిమానులు అయితే ప్రత్యేకంగా దర్శకుడిని విచిత్రమైన కోరికలు కూడా కోరుతున్నారు.

కొంత మంది అభిమానులు అనిల్ రావిపూడి ని ట్విట్టర్ లో టాగ్ చేసి మహేష్ ని విజయశాంతి ని ఒక జానపద గేయానికి డాన్స్ చేయించాలి అని చెప్తున్నారు. ఇంకొంత మంది వాళ్లిద్దరూ కలిసి డాన్స్ చేస్తే బాగుంటుంది, కలెక్షన్ల పరంగా తిరుగుండదు అంటున్నారు.

కానీ విజయశాంతి తన కి సినిమా లో మహేష్ తో సీన్లు లేవని చెప్పడం తో అనిల్ రావిపూడి ఫాన్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -