Monday, May 6, 2024
- Advertisement -

మీడియాను పరాయిపరం చేసిన మోడీ

- Advertisement -

మీడియా.. ప్రజల వాయిస్ ఇదీ.. సోషల్ మీడియా వచ్చాక ఇంకా వేగంగా వార్తలు, న్యూస్ సర్య్కూలేట్ అవుతున్నాయి. మీడియా పవర్ తో ఇప్పుడు ప్రభుత్వాలు, నాయకులు షేక్ అవుతున్న పరిస్థితి. అయితే దేశంలోని మెజార్టీ మీడియా అయితే బీజేపీకి లేదంటే కాంగ్రెస్ కు సపోర్టుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ మెజార్టీ టీడీపీకి సపోర్టుగా ఉంటే.. ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్, వైసీపీలు మీడియా బలాన్ని పెంచుకుంటున్నాయి.

ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీలు తాము చేసిన పనులను, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధానంగా మీడియానే పావుగా వాడుతున్నారు. అందుకే ఎవరో పెంచి పెద్ద చేసిన చానెల్స్, పత్రికలను వాళ్లు డబ్బులతో కొనేసి.. ఉన్న వాళ్లను తరిమేసి పార్టీల అనుబంధ వ్యక్తులు హస్తగతం చేసుకోవడం తాజాగా చూస్తున్నాం.

అయితే ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయంతో మీడియాను పరాయిపరం చేసే కుట్ర జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామణ్ తాజాగా మీడియా, ఏవియేషన్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారీగా పెంచారు. దీంతో ముఖ్యంగా మీడియాలో విదేశీ దిగ్గజ సంస్థలు వస్తే అవి పార్టీలకు , ఇక్కడి ప్రజలకు వాయిస్ లేకుండా చేస్తుంది. తమ విధానాలను, విదేశీ సంస్కృతిని ఇక్కడ రుద్దే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ, దేశీయ సమస్యలను ఇవి పట్టించుకునే అవాకాశాలుండవు. భారీ కార్పొరేట్ వ్యవస్థల చేతుల్లో మీడియాలు చిక్కితే స్థానిక జర్నలిస్టులకు సంస్థలకు ఇబ్బందే.

ఇలా మోడీ ఎఫ్డీఐలను మీడియా, ఏవీయేషన్ రంగాల్లో తెచ్చి మీడియాను ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తున్నారని.. ఇది మీడియా విశ్వసనీయతను దెబ్బతీస్తుందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -