- Advertisement -

ఇమామ్ సెంచ‌రీ….బంగ్లాకు 315 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించిన పాక్‌

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాక్ వైదొలిగింది. బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్‌లో పాక్ అనుకున్న ప‌రుగులు చేయ‌లేక చేతులెత్తేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో పాక్ 9 వికెట్ల న‌ష్టానికి 315 ప‌రుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్(100: 100 బంతుల్లో 7ఫోర్లు), బాబర్ అజామ్(96: 98 బంతుల్లో 11ఫోర్లు) బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అదరగొట్టారు. మిడిలార్డర్ విఫలం కావడంతో ఆఖర్లో మెరుపులు మెరిపించి భారీ స్కోరు సాధించే గొప్పగా అవకాశాన్ని చేజార్చుకుంది.

మొదట్లో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయిన బంగ్లా చివర్లో గట్టిగా పుంజుకుంది. ఒకా నొక ద‌శ‌లో 350 కిపైగా ప‌రుగులు చేసె స్థితిలో ఉన్న పాక్ కు ముస్తాఫిజుర్ రహమాన్(5/75) దిమ్మదిరిగే షాకివ్వడంతో ఆ స్కోరుకే పరిమితమైంది.బ్యాటింగ్ చేయడానికి వచ్చిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ గాయం కారణంగా రిటైర్డ్‌హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. చివరల్లో ఇమాద్ వసీం(43: 26 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) తనదైన శైలిలో రెచ్చిపోవడంతో పాక్ 300 మార్క్ దాటింది.

మొద‌ట టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. మొద‌టిలోనె పాక్‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. సైఫుద్దీన్ వేసిన 8వ ఓవర్లో ఓపెనర్ ఫకార్ జమాన్ నిష్క్రమించాడు. వికెట్ డౌన్ వ‌చ్చిన ఇమామ్‌తో క‌ల‌సి బాబ‌ర్ బంగ్లాదేశ్ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొని 150కి పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శతకానికి చేరువగా వచ్చిన బాబర్ సైఫుద్దీన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ కీలక సమయంలో పాక్‌కు ఊహించని షాకిచ్చాడు. పాక్ జోరు కొనసాగుతున్న తరుణంలో ఇమామ్ ఔటయ్యాడు. 99 బంతుల్లో 7ఫోర్ల సాయంతో 100 మార్క్ అందుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఇమామ్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -