Saturday, May 18, 2024
- Advertisement -

సాహో తో సతమతమవుతున్న సుజీత్

- Advertisement -

యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్ర లో సాహో సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా లో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాకుండా తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ని ప్రముఖ నటులు చాలా మంది ఈ సినిమా లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులకి అనేక అంచనాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా తో ప్రభాస్ రానుండటం తో ఈ సినిమా కచ్చితం గా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాదించాలి అనే కోరిక తో ఉన్నారు ఫాన్స్.

అయితే ఈ అభిమానుల యొక్క అత్యుత్సాహం, అనవసరమైన ఆర్భాటం సినిమా యూనిట్ మీద అనవసర ఒత్తిడి తెస్తుంది అని అందరూ చెప్తున్నారు. అయితే ఈ తతంగం అంతటి లో ఎక్కువ గా ఒత్తిడి తీసుకుంటుంది దర్శకుడు సుజీత్ అని చెప్పుకోవచ్చు. రెండు ఏళ్ళు గా ఇదే సినిమా పైన కష్ట పడుతున్న సుజీత్ మీద అభిమానులు తమ అంచనాలని అనవసరం గా రుద్దుతున్నారు. సినిమా ఔట్పుట్ విషయం లో కంగారు పడాల్సిన దర్శకుడు అభిమానుల గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -