Thursday, April 25, 2024
- Advertisement -

నంద గోపాల కృష్ణ కి తెలుగు లో తిప్పలు తప్పట్లే

- Advertisement -

సూర్య ప్రధాన పాత్రలో సెల్వ రాఘవన్ దర్శకుడి గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా నంద గోపాల కృష్ణ. ఎన్జీకే గా పిలువబడుతున్న ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. అయితే తమిళం లో ప్రచారాల తో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు లో మాత్రం ఆశించిన స్థాయి లో మెప్పించడం లో విఫలమవుతూ వస్తుంది. ప్రాపర్ గా ఈ సినిమా కి సంబందించిన ప్రచారం అసలు మేకర్స్ ఇప్పటి వరకు ఏమి మొదలు పెట్టలేదు.

ఇకపోతే సెల్వ రాఘవన్ కి సూర్య కి తెలుగు లో మంచి పేరే ఉంది కానీ పీ ఆర్ టీమ్ ఏందుకో దీనిని అంత గా పట్టించుకోవడం లేదు. సూర్య సినిమా టైం కి విడుదల అవుతుందేమో కానీ ఒక వేళ ప్లాప్ అయితే మాత్రం దానికి కచ్చితంగా ప్రమోషన్స్ లేమి కారణం గా చెప్పుకోవచ్చు.

సాయి పల్లవి, రకుల్ ప్రీత్ ఈ సినిమా లో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమా కి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఈ నెల 31 న ఈ సినిమా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -