Friday, May 3, 2024
- Advertisement -

‘జాతిరత్నాలు’ బ్యూటీకి బంపర్ ఆఫర్?

- Advertisement -

ఒక్క సినిమాతో తామేంటో నిరూపించుకుంటున్నారు కొత్తగా వస్తున్న హీరోయిన్లు. అయితే కొంత మంది తమ అందాలు విచ్చలవిడిగా ఆరబోసినా సక్సెస్ మాత్రం కలిసి రావడం లేదు. తమ నటనతో ప్రేక్షకులను దోచుకుంటున్నారు మరికొంత మంది హీరోయిన్లు. తాజాగా జాతిరత్నాలు చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఫరియా అబ్దుల్లా. ఇటీవల విడుదలైన ‘జాతిరత్నాలు’ చిత్రం యూత్ ని బాగా ఆకట్టుకుంటూ సూపర్ హిట్టయింది.

మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది.  తాజాగా ప్రముఖ హీరో రవితేజ నటించే సినిమాలో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు షర వేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఫరియాను బుక్ చేయాల్సిందిగా రవితేజ దర్శక నిర్మాతలకు సూచించినట్లు టాలీవుడ్ టాక్. దీంతో దర్శక నిర్మాతలు ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదేకాకుండా మరికొన్ని ఆఫర్లు కూడా ఆమెకు వస్తున్నట్టు చెబుతున్నారు.

దేశంలో తొలి లీగల్ సెక్స్ స్టోర్ ఎక్క‌డుందో తెలుసా?

అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం

మ‌రో బాలీవుడ్ బ్యూటీకి క‌రోనా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -