Saturday, April 27, 2024
- Advertisement -

దేశంలో తొలి లీగల్ సెక్స్ స్టోర్ ఎక్క‌డుందో తెలుసా?

- Advertisement -

భారతదేశం కామసూత్ర భూమిగా గుర్తించబడింది, అయినప్పటికీ సెక్స్ గురించి మాట్లాడటం నేటికీ దేశంలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది. ప్రజలు బహిరంగంగా సెక్స్ గురించి మాట్లాడరు. అయితే, వీట‌న్నింటిని ప‌క్క‌న‌పెడుతూ.. దేశంలోనే మొట్ట‌మొద‌టి సెక్స్ బొమ్మ‌ల దుకాణం గోవాలో ప్రారంభమైంది. దీంతో దేశంలో మొదటి చ‌ట్ట‌ప‌ర‌మైన సెక్స్ బొమ్మ‌ల దుకాణంగా పేరుగాంచింది. అదే గోవాలోని కామా గిజ్మోస్‌.

ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. భారతదేశంలో కరోనావైరస్ లాక్ డౌన్ స‌మ‌యంలో సెక్స్ బొమ్మల ఆన్‌లైన్ అమ్మకం 65% పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే గోవాలో స్టోర్ వెల‌సింది. గోవాలోని కలాంగూట్ స్ట్రెచ్ వెంట ఉన్న ఈ దుకాణంలో అనేక రకాల సెక్స్ బొమ్మలు, ప్రత్యేకమైన కండోమ్‌లు, స్ప్రేలు, జెల్స్‌, వైబ్రేటర్లు, పట్టీలు, ప్యాకర్స్‌ వంటివి విక్రయానికి ఉంచారు. ఈ కామా గిజ్మోస్ ను మెడికల్ దుకాణం మాదిరిగానే డిజైన్‌ చేసి మంచి విద్యుత్‌దీపాలతో ఆక‌ర్ష‌ణీయంగా అలంకరించారు.

ఈ కామా గిజ్మోస్ ఫిబ్ర‌వ‌రి 14న ప్రారంభ‌మైంది. భార‌త్‌లో అధికారిక సెక్స్ వ‌స్తువులను విక్ర‌యించే దుకాణంగా రికార్డు సృష్టించింది. దీని గురించి షాపు య‌జ‌మాని నీర‌వ్ మెహ‌తా మాట్లాడుతూ.. ఈ కామ గిజ్మోస్ దుకాణంలోకి వ‌చ్చిన వారికి ఎక్క‌డ కూడా నగ్నత్వంగానీ, అశ్లీలతగానీ కనిపించదని తెలిపారు. .దుకాణం యజమాని నీరవ్‌ మెహతా తెలిపారు. ఇందులో బీడీఎస్‌ఎం సెట్లు, మార్ష్‌మాల్లౌ-ఫ్లేవర్డ్, గ్లో-ఇన్-ది-డార్క్, వేగన్ కండోమ్స్‌, మహిళల కోసం ప్రత్యేక రింగులు‌, వైబ్రేటర్లు, రోల్ ప్లే కాస్ట్యూమ్స్ అందుబాటులో ఉన్నాయ‌న్నారు.

అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం

మ‌రో బాలీవుడ్ బ్యూటీకి క‌రోనా

క‌మ‌ల్ హాసన్ కారుపై ‘దాడి’

ప‌సుపు పాల‌తో ప్ర‌యోజ‌నాలెన్నో !

చెరుకు రసంతో మహిళలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -