ప్రస్తుతం అన్ని రంగాల్లో స్త్రీ పురుషులు సుదీర్ఘకాలం సహజీవనం చేయడం కామన్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో సహజీవనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇష్టమున్న రోజులు సహజీవనం చేయడం తరువాత విడిపోవడం కామనే. సహజీవనంపై ఫిదా బ్యూటీ సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు చేసింది.
అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా, సహజీవనం చేయడం తప్పు కాదని అది వారి ద్దరి ఇష్ట ప్రకారమే జరుగుతుందన్నారు. సహజీవనం వారిద్దరి మధ్యా ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం అన్న సాయిపల్లవి దానికి నేను వ్యతిరేకం కాదని అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
సాయిపల్లవి నటించిన రెండు సినిమాలు మారి-2′, ‘పడిపడిలేచె మనసు’ విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూర్యతో జత కట్టిన ఎన్‌జీకే చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాయిపల్లవి మలయాళంలోనూ ఫాహత్ ఫాజిల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది.
ఇటీవల మారి–2 చిత్ర ప్రమోషన్ కోసం చెన్నైకి వచ్చిన సాయిపల్లవిమీడియాతో మాట్లాడుతూ ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లీవింగ్ టుగెదర్ సంబంధం సాగిస్తున్నారా? లాంటి ప్రశ్నలు చాలా మంది వేస్తున్నారని అంది. అయితే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు పుస్తకాలను, సినీరంగంలోకి వచ్చిన తరువాత నటనను ప్రేమిస్తున్నానని చెప్పింది.
వ్యక్తిగతంగా తనకు లీవింగ్ టుగెదర్ సంబంధాలు అవసరం లేదని పేర్కొంది. కానీ తనకు లివింగ్ టుగెదర్ సంబంధం వద్దని అంతమాత్రాన సహజీవనానికి వ్యతిరేకినని చెప్పబోవడం లేదని అంది. తాను వైవాహిక జీవితాన్నే కోరుకుంటున్నానని చెప్పింది.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!