శ్రీదేవి అక్క.. నాకు వరసకు పిన్ని..!

- Advertisement -

గులాబీ, పెళ్లి, ప్రియరాగాలు, తిరుమల తిరుపతి వేంకటేశ వంటి చిత్రాలతో తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు మహేశ్వరి. రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన గులాబీ సినిమాలో మేఘాలలో తేలిపొమ్మన్నది.., ఏవేళలో నీవు.. లాంటి పాటలు ఇప్ఫటికీ క్లాసిక్ గా నిలిచాయి.

ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు మహేశ్వరి. చాలాకాలం తర్వాత ఇటీవల తెలుగులోని ఒక ప్రముఖ కమెడియన్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. చాలా విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవితో మీకున్న అనుబంధం ఏమిటి ? ఆమె మీకు అక్కయ్య అవుతుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

- Advertisement -

అందరు శ్రీదేవి తనకు అక్కయ్య అవుతుందని అనుకుంటారని, కానీ ఆమె తనకు పిన్ని వరుస అవుతుందని చెప్పారు. శ్రేదేవిని చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడం అలవాటని.. దీంతో చాలా మంది తనకు శ్రీదేవి అక్కయ్య అవుతుందని అనుకుంటారని చెప్పింది. శ్రీదేవి మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని తెలిపింది. ఆవార్త విన్నాక కోలుకోవడానికి చాలా కాలం పట్టిందని తెలిపింది.

Also Read: ధనుష్, ఐశ్వర్యల విడాకులు అందుకేనా..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -