Wednesday, April 24, 2024
- Advertisement -

లేడీ ఓరియంటెడ్ మూవీలో ఫిదా బ్యూటీ…

- Advertisement -

ఫిదా, ఎంసీఏ చిత్రాల ద్వారా చక్కటి నటిగా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తమిళ బ్యూటీ పొన్ను సాయిపల్లవి. ఎంత పేరు తెచ్చుకుందో అంతే వివాదాస్పాదాలు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అద్భుత‌మైన ఆఫ‌ర్ ప‌ల్ల‌వి త‌లుపు త‌ట్టింది. హీరోయిన్ ప్రాధాన్యమున్న ఓ చిత్రంలో నటించేందుకు ఆమె పచ్చజెండా ఊపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న ‘నీది నాది ఒకే కథ’ చిత్రం దర్శకుడు వేణు ఉడుగుల ఓ నవతరం యువతి నేపథ్యంలో సాగే కథని సిద్ధం చేశారంట‌. ఆస్టోరీని సాయిపల్లవికి వినిపించారని, అది ఆమెకు నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం. సాయిపల్లవి మొదట్నుంచీ మంచి పాత్రలైతేనే ఓకే చెబుతోంది. ఒకవేళ తనకు నచ్చకపోతే నిర్మొహమాటంగా రెజక్ట్ చేస్తోంది. మరి ఈ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఆ కథలో తప్పక బలముంటుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -