Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సినిమాకు రంగం సిద్ధం

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావుకు జీవిత చ‌రిత్ర‌పై ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. సినిమాపై ఇప్పుడు ప‌నులు వేగవంత‌మ‌య్యాయి. ఆ సినిమాకు ఏర్పాట్ల‌న్నీ పూర్త‌యిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమా కోసం ప్ర‌ముఖ రచయిత బాహుబ‌లి క‌థ‌లు రాసిన వ్య‌క్తి విజయేంద్ర ప్రసాద్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను నివాస్ అనే ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్నాడు. ఈ సినిమా విష‌య‌మై ద‌ర్శ‌కుడు నివాస్ విజయేంద్ర వర్మతో చర్చలు చేశారు. డాక్యుమెంటరీగానే మొద‌ట తీయాల‌ని ప్ర‌య‌త్నించ‌గా కొన్ని నిమిషాల్లో ఏం చెప్ప‌లేం అని భావించి సినిమా తీయాల‌ని నిర్ణ‌యించారు. దానికనుగుణంగా సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయి.

బాహుబలి ర‌చ‌యిత విజయేంద్ర వ‌ర్మ ఈ సినిమాకు రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. న‌టీనటులు, టెక్నీషియన్లు, ఎప్పుడూ ప్రారంభించేది త్వరలోనే వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -