Tuesday, April 30, 2024
- Advertisement -

భార‌త్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ‌రో అరుదైన గుర్తింపు..

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీకి మ‌రో సారి అంత‌ర్జాతీయం మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. అంత‌ర్జాతీయంగా క్రికెట్‌లో నిల‌క‌డ‌గా ఆడుతూ ప్ర‌పంచ బ్యాట్స్‌మేన్‌గా గుర్తింపు పొందిన కోహ్లీ మైన‌పు విగ్ర‌హాన్ని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు.

సచిన్, కపిల్ దేవ్, ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోల విగ్రహాల సరసన విరాట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఉంచడం పట్ల కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. జీవితాంతం గుర్తుండిపోయేలా తన బొమ్మను అక్కడ ఉంచేందుకు వీలుగా ఓపిగ్గా కొలతలు తీసుకున్న టుస్సాడ్స్ మ్యూజియం సిబ్బందికి విరాట్ ధన్యవాదాలు తెలిపాడు.

2006 దేశవాళి క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లి 2008 అండర్‌-19 వరల్డ్‌కప్‌ అందించి సీనియర్‌ జట్టులోకి వచ్చాడు. అనతి కాలంలోనే ప్రపంచ రికార్డులన్ని తిరగ రాస్తూ ప్రపంచ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సాధించాడు. ఇప్పటికే అర్జున అవార్డ్‌, ఐసీసీ వరల్డ్‌ క్రికెటర్‌, మూడు సార్లు బీసీసీఐ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులందుకున్న కోహ్లికి భారత ప్రభుత్వం నుంచి గౌరవ పద్మశ్రీ పురుస్కారం కూడా లభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -