Tuesday, May 21, 2024
- Advertisement -

ఎనభై కోట్ల సినిమా ముప్పై ఎనిమిది రోజుల్లో పూర్తి

- Advertisement -

బాలీవుడ్ లో ఇక్కో స్టార్ హీరో సంవత్సరానికి మహా అయితే ఒకటి రెండు సినిమాలతోనే వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆపసోపాలు పడుతుంటే కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఒక ఏడాదికి కనీసం 4 సినిమాలతో వస్తూ అందులో రెండుకి తగ్గకుండా విజయాలను సొంతం చేసుకుంటున్న సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన వర్కింగ్ సీక్రెట్ బయటపెట్టాడు.

ఒక్కో సినిమాకు కొందరు ఏళ్ళకి ఏళ్ళు షూటింగ్ జరిపి కోట్లు కుమ్మరిస్తారని నా వరకు మాత్రం ఒక సినిమా కచ్చితంగా 60 రోజుల్లోపు పూర్తి కాకపొతే నచ్చదని చెబుతున్నాడు. తన అప్ కమింగ్ మూవీ హౌస్ ఫుల్ 3 సినిమా 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినా కేవలం 38 రోజుల్లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిందని అంటున్నాడు.

ప్రతీ వీక్ లో 5 రోజులు రోజుకి 8 గంటలు కష్టపడతానని శని, ఆదివారాలు సెలవు తీసుకుంటానని ఒక సినిమాను కచ్చితంగా 60 రోజుల మాగ్జిమం టైం పీరియడ్ లో పూర్తి చేయాలని టీం మొత్తానికి ముందే సూచనలు ఇస్తానని అందుకే మిగతా స్టార్స్ కన్నా ఎక్కువ సంపాదిస్తూ ప్రతీ ఇయర్ హైయెస్ట్ టాక్స్ పేయిర్ గా నిలుస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -