Tuesday, May 28, 2024
- Advertisement -

జగన్ ఎక్కడ తప్పుచేస్తున్నాడో తెలుసా..?

- Advertisement -

ఎంతమందైనా వెళ్లనీ…ఇంకా నాది నాకుందనే ఫీలౌతున్నాడు యువరాజు. ఇంతమంది ఇలా వెల్లిపోతుంటే… రానున్న రోజుల్లో వచ్చే ముప్పును ముందుగా పసిగట్టలేకపోతున్నాడా…లేక ఇక్కడ కూడా అకౌంట్ ఆఫీసర్ గారి విజయవంతమైన లెక్కలు నమ్ముతున్నాడో తెలియదుగాని …మొత్తానికి ముచ్చటపడి మరీ ముంచుకున్నట్లుంది మనోడి యవ్వారం.

విచిత్రమేమిటంటే…యువనేత కు ఎంతో క్లోజ్ అనుకున్నవారు సైతం  పార్టీకి గుడ్ బై చెప్పి…వెలుతూ వెల్తూ  జగన్ వైఖరి గురించే మాట్లాడుతున్నారంటే….ఏం చెబుతాం చెప్పండి. యువరాజు  అప్ డేట్ అవ్వాల్సిన చోట అప్ డేట్ కాకపోతే ఎలా. ఇక్కడ అతను ఆలోచించాల్సింది ఒకటుంది. పార్టీలోకి ఎందరో తలపండిన నేతలు,మాంచి వాక్చాతుర్యం ఉన్న లీడర్లు వస్తున్నారంటే… “అది నిన్ను చూసి వస్తుంది కాదు. జనాలకు  నీపై ఉన్న గురిని  చూసే వస్తున్నారు” అనే విషయాన్ని  ముందుగా  గుర్తించాలి. 

నీది నీకెంత ఉందో వచ్చినవారికి అంతే ఉందనే మ్యాటర్ కు గౌరవం ఇవ్వకపోతే ఎలా. లేదు వచ్చినవారంతా నన్ను చూసే వచ్చారనుకుంటే…. ఇన్ని వందలకోట్లు ఆస్తులు అటాచ్ మెంట్ అయ్యాక కూడా  నన్ను చూసి వచ్చారనడం రాజకీయాలపై సారుకు ఉన్న పరిణితిని తెలియజేస్తోంది. ఒకవేల వెల్తున్న వారంతా అధికారి పార్టీ ఇచ్చే మొత్తానికి కకృత్తి పడ్డారనే అనుకుందాం. మరి ఎలాంటి పొజిషన్ లోను లేనప్పటికీ…. పార్టీలోని ఉండి యువరాజు పై విసిగెత్తి వెల్తున్న  నేతల గురించి ఏమనుకోవాలి. ఇక్కడ ఒక్క మాటలో మనోడి మ్యాటర్  ముగించేయాలి అంటే…. పార్టీ ఆఫీస్ ను కార్పొరేట్ ఆఫీస్ గా ట్రీట్ చేస్తున్న యువరాజు పుణ్యమా అంటూ…ఇక్కడ  ప్రతి క్షణం  నేతల ఇగోలు దెబ్బతింటూనే….. ఉన్నాయి.

కొసమెరుపు:  చంద్రబాబు ఇన్ టెన్షన్ ఎలా ఉన్నా… ఆయనగారు నటిస్తారు… యువరాజుకి  నటించడం చేతకాదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -