Friday, April 26, 2024
- Advertisement -

ఆసక్తిక‌రంగా నిఖిల్ కొత్త సినిమా ప్రీ లుక్!

- Advertisement -

యంగ్ హీరోల‌లో నిఖిల్ మంచి జోష్‌లో ఉన్నాడు.వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు.’ఎక్కడికి పోతావు చిన్నవాడా’ .. ‘కేశవ’ .. ‘కిరాక్ పార్టీ’ సినిమాలతో నిఖిల్ వరుస సక్సెస్ లను అందుకున్నాడు.వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తు త‌న‌కంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.నిఖిల్ ప్ర‌స్తుతం త‌మిళ్ రీమేక్ సినిమాలో న‌టిస్తున్నాడు.

2016లో తమిళంలో వచ్చిన ‘కణితన్’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీనే రీమేక్ చేస్తున్నాడు నిఖిల్‌.ఈ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి న‌టిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది.అయితే సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టాడు హీరో నిఖిల్‌. ‘గన్’ కంటే ‘పెన్’ చాలా పవర్ఫుల్ అనే కాన్సెప్ట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు.

రేపు నిఖిల్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. రేపు ఉదయం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను విడుదల చేయనున్నారు.వ‌రుస హిట్ల మీద ఉన్న నిఖిల్‌కు ఈ సినిమా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -