Friday, May 24, 2024
- Advertisement -

చిరంజీవికి అప్పుడు 6 .. ఇప్పుడు 8

- Advertisement -

మెగస్టార్ చిరంజీవిని ఓ సెంటిమెంట్ వెంటాడుతుంది. అది ఒక రకంగా తనకు మంచిదే అన్నది చిరు అభిప్రాయం.విషయంలోకి వచ్చేద్దాం.చిరు తన 150 చిత్రం విషయంలో కాస్త ఎక్కువగానే ఆలోచించేస్తున్నాడు.

ఈ సందర్భంగా  అతని రీ గ్రాండ్ ఎంట్రీకి గతంలో వచ్చిన సెంటిమెంట్లను ఇప్పుడు కూడా వల్లె వేస్తున్నాడు.అతను చెబుతున్న ఆ లెక్కలను ఒకసారి చూస్తే….90ల్లో చిరుకు ఓ సారి గట్టి దెబ్బే తగిలింది. జగదేక వీరుడు అతిలోక సుందరి ఘరానా మొగుడు ముఠా మేస్త్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో చిరు ఆ టైమ్లో మాంచి ఊపు మీదున్నాడు.కరెక్ట్ గా అలాంటి టైమ్లో సారుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 ఫ్లాప్ లు వెతుక్కుని మరీ వచ్చేశాయి.

 మెకానిక్ అల్లుడుతో మొదలైన ఫ్లాప్ ల పరంపర ‘రిక్షావోడు’ వరకు కొనసాగింది.ఇక చేసేదేం లేక 1995 తర్వాతి ఏడాది అతను ఎలాంటి సినిమా చేయనే లేదు.ఎంటైర్ చిరు కెరియర్ లో అదే బ్యాడ్ టైమ్ అని చెప్నవచ్చు. దీంతో అల్లు రామలింగయ్యగారు తన అల్లుడు కు వస్తోన్న ఫెయిల్యూర్స్ గురించి పెద్ద సిట్టింగే పెట్టినట్లు చెబుతారు.మదించగా మదించగా  చిరు రీమేక్ తో హిట్ కొట్టాల్సి వచ్చింది.అదే హిట్లర్ .ఇది ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు.

ఇప్పుడు 3rd ఇన్నింగ్స్ ను ఆడుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఈసారి కూడా చిరుకు  8 ఏళ్ళ గ్యాప్ వచ్చింది.దీనికి రీజన్స్ చెపుకోవాలే గాని చాలానే ఉన్నాయి.అవి అందరికీ తెలిసినవే.అందుకే ఫిలిం సర్క్యూట్లో చిరు విషయంలో అప్పుడు వరుసగా 6 చిత్రాలు ఇబ్బంది పెడితే ఇప్పుడు 8 ఏళ్లు ఇబ్బంది పెట్టాయని చెప్పుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -