శ్రీఎను వైట్ల – రాం చరణ్ ల కాంబినేషన్ సినిమా అనే దాని కంటే మెయిన్ గా “చిరంజీవి” ఆరేళ్ళ తరవాత నటిస్తున్న సినిమా అనే ప్రాతిపదికనే “బ్రూస్ లీ” కి ప్రమోషన్ కానీ జనాల్లో ఆసక్తి కానీ సాగుతోంది. సినిమా కి రెండు మూడు నెలల క్రితం నుంచే కీలక ఏరియా లలో బయ్యర్లకి అమ్మే సమయం లో చిరంజీవి సినిమా అంటూ నే పేరు పెట్టి హాట్ కేక్ లాగా అమ్మేసారు. దసరా సీజన్, రాం చరణ్ –
చిరంజీవి లు కలిసి నటించిన సినిమా కావడం తో భారీ కలక్షన్ ల మీద కన్నేసి రుద్రమదేవి కోసం వాయిదా కూడా వేయలేదు రాం చరణ్. శ్రీను వైట్ల – కోన వెంకట్ ల కాంబినేషన్ ని ఆగాడు దెబ్బతో తెలుసుకుని తన సినిమా సేఫ్టీ కోసం అయినా వారిద్దరినీ కలిపిన చెర్రీ ఆ ప్లాన్ ఎంత వరకూ పారించాడో చూద్దాం
అక్కా – తమ్ముళ్ళ సెంటిమెంట్ గా సాగిన ఈ సినిమా మొదటి నుంచీ రేసీ గానే నడుస్తుంది. తండ్రి చేతిలో తిట్లూ, తన్నులూ తింటూ అక్కకోసం త్యాగాల మీద త్యాగాలు చేసే తమ్ముడు గా చెర్రీ మంచి నటనే కనబరిచాడు. గోవిందుడు అందరి వాడెలే తరవాత కాస్త కొత్త వైవిధ్యమైన ఎపిసోడ్ ల మీద చెర్రీ కన్ను పడినట్టు కనిపిస్తోంది. సెంటిమెంట్ అంటే మరీ ఓవర్ డోస్ వెళ్ళకుండా శ్రీను వైట్ల జాగ్రత్త తీసుకున్నాడు. కోనా వెంకట్ కూడా తన డైలాగుల పరంపర లో అవసరం ఐన చోట మాత్రమె పంచ్ లు వేస్తూ సాగించాడు కథ ని . రావు రమేష్ కి మళ్ళీ మంచి పాత్ర దొరికింది, సంపత్ విలన్ పాత్రలో ఆదరకోట్టాడు. నదియా కి స్కోప్ ఉన్న పాత్ర వచ్చినా పెద్ద రాణించే అవకాశం దక్కలేదు. దీంతో ఆమె పాత్ర ని మరీ అత్తారింటికి దారేది రేంజ్ లో ఊహించుకుంటే కష్టం. కృతీ పరవాలేదు అనిపించగా రకుల్ ప్రీత్ గ్లామర్ తో ఆదరకోట్టేసింది . సినిమా లో చాలా పెద్ద హై లైట్ చిరంజీవి ఉన్న నాలుగు నిమిషాలు సినిమా కి ఊపిరి పోసాడు చిరంజీవి. ఫైట్ కోసం హేలీకాప్తర్ లో నుంచి రంగం లోకి దిగే చిరూ ఫాన్స్ కి లిటరల్ గా పిచ్చేక్కించేసాడు . చిరంజీవి ఎంట్రన్స్ కోసం ఆరు సంవత్సరాలు ఎదురు చూసిన వీరాభిమానులకి కడుపు నిండా ఫుడ్ పెట్టేసాడు. సినిమా లో పాటలు చాలా పాపులర్ అయ్యాయి తెరమీద కూడా అదే రేంజ్ లో బోర్ కొట్టకుండా సాగాయి. కథనం బోర్ కొట్టిస్తున్న వేళ సాంగ్స్ సేవ చేసిన సందర్భాలు రెండు కంటే ఎక్కువే ఉన్నాయి. చరణ్ డాన్స్ లు ఇక చెప్పాల్సిన పనే లేదు. బ్రాహ్మీ కామిడీ పరవాలేదు.
శ్రీను వైట్ల సినిమా అనగానే సెకండ్ హాఫ్ కామెడీ చాలా ఇంపార్టెంట్ , ఆగాడు సినిమా కి కూడా ఆ పార్ట్ దెబ్బ వేసి సినిమా దారుణమైన నష్టాల్ని చవిచూసింది. కానీ ఈ సారి కోనా వెంకట్ తిరిగి వచ్చాడు బ్రాహ్మీ కామిడీ అదరహో అనిపిస్తారు అనుకుంటే యావరేజ్ గా లాగేసారు. మిగిలిన ఆలీ, పోసాని లని కూడా సరిగ్గా వాడుకోలేదు. పృధ్వీ రాజ్ కి పాజిటివ్ క్యారెక్టర్ ఇచ్చి కామెడీ తో సంబంధం లేకుండా చేసారు. చరణ్ చాలా చోట్ల నటన పూర్తిగా దొరికిపోయేవిధంగా చేసాడు. పని గట్టుకుని ఎక్స్ ప్రెషన్ లు ఇవ్వడం ఓవర్ యాక్షన్ లాగా తేలిపోయింది. కృష్ణ వంశి కాబట్టి గోవిందుడు లో సూపర్ అనిపించినా ఈ సినిమా లో చరణ్ పెర్ఫార్మెన్స్ తేట తెల్లం అయిపొయింది. కథనం విషయం లో చాలా స్లో గా మరి కాసేపటి కి కంగారు గా లాగేసాడు శ్రీను వైట్ల. కన్ఫ్యూజన్ కామెడీ తెరమీద చెయ్యడం మానేసి థియేటర్ లో జనాలకి కన్ఫ్యూజన్ చెయ్యడం మొదలెట్టాడు. ఈ మాత్రానికి బ్రాహ్మీ, పోసాని, పృధ్వీ, ఆలీ ఎందుకు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కి ముందు ముప్పై నిమిషాలు సినిమాని హై పిచ్చ్ కి తీసుకుని వెళ్లి ట్రాక్ లో పెట్టినా సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశ పరిచాడు.
మొత్తంగా , రొటీన్ కథలతో రొటీన్ గా వెళ్ళిపోతున్న శ్రీను వైట్ల తన రొటీన్ లో సెకండ్ హాఫ్ బకరా కామెడీ ని కాస్త ఎలిమినేట్ చెయ్యాలి అనుకున్నట్టు కనపడ్డాడు. అది ఈ సినిమా కి పెద్ద మైనస్ అయ్యి కూర్చుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకూ పరవాలేదు సెకండ్ హాఫ్ బాగుంటే బ్లాక్ బస్టర్ చేసేయచ్చు ఆనుకున్న ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ లో ఎక్కడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు దర్శకుడు . భారీ కామెడీ బ్యాచ్ ఉన్నా సరిగా ఉపయోగించుకోకుండా కంగారు కథనం తో పరిగెత్తేసాడు. మార్కెటింగ్ బాగా చేసుకుంటే యావరేజ్ రెవెన్యూ తో బయటపడచ్చు కానీ పని గట్టుకుని చూసే అంశాలు ఈ సినిమాలు ఏమీ లేవు. చిరంజీవి ని ఆరు సంవత్సరాల తర్వాత తెరమీద చూడాలి అని కోరుకునే చిరు వీరాభిమానులకి మాత్రం భుక్తాయాసం తో కూడిన ఆ నాలుగు నిమిషాలూ(చిరు తెరమీద ఉండే సమయం) ఎప్పటికీ మరచిపోలేనివి అవుతాయి .. అంతకు మించి ఈ సినిమా లో ఎగబడి చూడడానికి కనీస అంశాలు కూడా లేవు ..
Rating: 2.75
