Saturday, May 18, 2024
- Advertisement -

పోటీ బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్యే కాదు, మరో నాలుగు సినిమాలు కూడా!

- Advertisement -

నందమూరి నటసింహం బాలయ్య సినిమా , ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా… ఒకేసారి విడుదల కానున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఒకే వంశానికి చెందిన ఈ హీరోలిద్దరూ అమితుమి తేల్చుకోబోతున్నారు. ఇదిలా ఉంటే.. సంక్రాంతికి ఈ సారి ఏకంగా ఎన్నడూ లేని రీతిలో అరడజను సినిమాలు విడుదల కాబోతున్నాయి.

 పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా పోటీలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు చిన్న సినిమాలు ఈ సారి పోటీలో ఉన్నాయి.

ఇవన్నీ చిన్న సినిమాలే కానీ.. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమాలు. యావరేజ్ ఇమేజ్ ఉన్న హీరోలు ఈ సినిమాలతో బరిలో నిలవబోతున్నారు. ఇలా పోటీలో ఉన్న హీరోల్లో.. సునీల్, నాని, శర్వానంద్, సూర్యలు ఉన్నారు. తాజాగా సునీల్ “కృష్ణాష్టమి” సంక్రాంతికి విడుదల కావడం ఖాయమైంది. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తమిళ హీరో సూర్య సినిమా ’24’ సంక్రాంతి బరిలో నిలవడం ఖాయమైంది. ఇది మాత్రమే గాక ఉత్సాహం మీద ఉన్న యువహీరోలు నాని, శర్వానంద్ ల సినిమాలు కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్నాయి. ఇలా చెప్పుకోదగ్గ.. ప్రేక్షకులను థియేటర్ల వరకూ ఆకర్షించగల ఆరు మంది హీరోల సినిమాలు ఒకేసారి విడుదల కావడం నిజంగా విశేషమే. మరి ఈ హీరోల సినిమాల్లో ఏవి నిలబడతాయో.. ఏవి ఫట్ మంటాయో వేచి చూడాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -