పవన్ సరసన రకుల్

ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కిక్2, బ్రూస్ లీ సినిమాలు ఫ్లాప్ అయినా రకుల్‍ కి అవకాశాలు వస్తునే ఉన్నాయి.సినిమాల సంగతి ఎలా ఉన్నా రకుల్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

అందుకే రకుల్ కి ఇంకా అవకాశాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం రకుల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ ను,  ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’ హీరోయిన్‍గా నటిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ‘ సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది కాని రకుల్ డేట్స్ కుదరక ఆ సినిమాని వదులుకోవల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రకుల్ బంఫర్ ఆఫర్ కొట్టింది. త్వరలో దాసరి నారాయణరావు , పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‍లో చిత్రంలో రకుల్ నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. తక్కువ సమయంలోనే టాప్ హీరోస్ తో నటించే అవకాశం దక్కించుకుంది రకుల్.