Tuesday, May 14, 2024
- Advertisement -

తెలుగు టైటిల్ ఇదే..!

- Advertisement -

“లింగా” తర్వత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో సినిమాతో రెడీ అయిపోయారు. భారీ అంచనాలతో వచ్చి అట్టర్ ప్లాఫ్ గా నిలిచిన లింగాతో రజనీ అభిమానులనే తీవ్రంగా నిరాశ పరిచాడు. ఇక సాధారణ సినీ అభిమానుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. భారీ పెట్టుబడి కూడా పెట్టినందు వల్ల లింగా సినిమా అటు కమర్షియల్ గా కూడా వర్కవుట్ కాలేదు.

డిస్ట్రిబ్యూటర్స్ కు తీవ్రమైన లాసునే మిగిల్చింది. ఆ సినిమా పంపిణీదారుల కష్టాలు మొన్నటి వరకూ వార్తల్లో నిలిచాయి. కొందరైతే ఏకంగా రజనీకాంత్ నే నిందించారు. అంచనాల పేరుతో భారీ మొత్తానికి ఆ సినిమాను తమకు అంటగట్టారని వారు లింగా యూనిట్ పై మండి పడ్డారు.

మరి ఆ సినిమా సంగతలా ఉంటే.. ఇప్పుడు మరో సినిమా రెడీ అవుతోంది. మలేసియాలో ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటునన ఆ సినిమా పేరు “కబాలి”. మొన్నటి వరకూ తెలుగులో కూడా ఈ సినిమా అదే పేరుతో విడుదల అవుతుందనుకున్నారంతా. అయితే కబాలి అనేది కేవలం తమిళ టైటిల్ మాత్రమేనని తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాకు వేరే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. “మహదేవా” పేరుతో ఈ సినిమా తెలుగులో విడుదల అయ్యే అవకాశం ఉంది. రజనీకాంత్ సినిమాలకు తగ్గట్టుగా ఈ టైటిల్ అయితే బాగుంటుందని దీని రూపకర్తలు ఫీలవుతున్నారట. మరి ‘లింగా’ తో వెళ్లిన రజనీకాంత్ మళ్లీ ‘మహదేవా’ గా వస్తున్నాడనమాట. ఇది ఆయనకు ఎలాంటి అనుభవాన్నిస్తుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -