Tuesday, May 7, 2024
- Advertisement -

తెలంగాణ సర్కార్ నిర్ణయం

- Advertisement -

ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదేనని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అది ప్రభుత్వ మార్పు అయినా… కొత్త జిల్లాలు.. మండలాల ఏర్పాటు అయినా ప్రజాభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయించింది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, ఇందుకోసం పంచాయితీల్లో తీర్మానాలు జరగాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పంచాయితీలు, మండలాలు కొత్త జిల్లా ఏది కావాలి.. కొత్త మండలం ఏక్కడ ఉండాలి వంటి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిరిసిల్లాను ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఇంతవరకూ 23 జిల్లాలే అనుకుంటున్న ప్రభుత్వం ఈ నిర్ణయంతో దాని సంఖ్య 24కు పెరిగింది. ఇక శంషాబాద్, గద్వాల్ జిల్లాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

జనాభాను బట్టి చూస్తే సికింద్రాబాద్ జిల్లా పెద్ద జిల్లాగా మారుతుందని, మండలాల పరంగా చూస్తే నల్గండ జిల్లా పెద్దదని నిర్ణయించారు. విస్తీర్ణం అంశంలో కొమరం భీం జిల్లా పెద్దదిగా అవతరించనున్నది.  ఒక జిల్లాను రెండు జిల్లాలుగా విడదీస్తే అక్కడున్న ఉద్యోగులను రెండు జిల్లాలకు సర్దుతారు. కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే మాత్రం కొత్త ఉద్యోగులను తీసుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -