Thursday, May 2, 2024
- Advertisement -

భార్గవ్ విషయంలో అసలు విషయాలు బయటపెట్టిన ఫన్ బకెట్ టీమ్..!

- Advertisement -

కొందరు ఏదైనా సంస్థలో పని చేస్తున్నారంటే ఆ సంస్థకు మంచి పేరు తీసుకు వస్తారు. మరికొందరు ఆ సంస్థ పేరు వాడుకుని వారు పాపులర్ అవుతారు. ప్రస్తుతం అలా పాపులర్ అయిన వారిలో భార్గవ్ ఒకరు. భార్గవ్ కన్నా ఫన్ బకెట్ భార్గవ్ అంటే అందరూ ఈజీగా గుర్తుపడతారు. గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఫన్ బకెట్ భార్గవ్ పేరు ఎక్కువగా వినబడుతోంది. దీనికి కారణం భార్గవ్ చేసిన రేప్ అని చెప్పవచ్చు.

అయితే తాజాగా ఫన్ బకెట్ టీమ్ మీడియా ముందుకు వచ్చి అసలు విషయాన్ని బయటపెట్టారు.తమ సంస్థలో పనిచేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న భార్గవ్ ఆ సంస్థ నుంచి విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి అతనితో మాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవని అతని పేరు ముందు మా ఫన్ బకెట్ పేరు పెట్టుకొని మా సంస్థ చెడ్డ పేరు తీసుకువస్తున్నాడని వారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఫన్ బకెట్ ప్రస్తుతం ఎంతో పాపులర్ అయింది.కానీ ఒక వ్యక్తి వల్ల ఆ సంస్థకు చెడ్డ పేరు రావడం మాకిష్టం లేదు. ఫన్ బకెట్ ను ప్రజలు ఎంతగానో స్వాగతిస్తున్నారు. ఇందులో నుంచి ఎంతోమంది సినిమాలలో నటించే అవకాశాలను సంపాదించుకున్నారు ఇలాంటి సమయంలో భార్గవ్ వల్ల చెడ్డపేరు రావడం ఇష్టం లేదని తన పేరు ముందు ఫన్ బకెట్ పేరు వింటేనే ఎంతో బాధగా ఉందని అందుకే అతని పేరు ముందు ఫన్ బకెట్ అని రాయొద్దు అంటూ మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -