Tuesday, April 30, 2024
- Advertisement -

మ‌హారాష్ట్రలో మ‌ద్యం దొర‌క‌క శానిటైజ‌ర్ తాగిన వైనం.. ఏడుగురి మృతి

- Advertisement -

గత ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు మూసి వేశారు. దాంతో మందుబాబుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాంతో కొంత మంది రక రకాల డ్రగ్స్ వాడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మరికొంత మంది మత్తు వాసన వస్తుందని శానిటైజర్ కూడా త్రాగి ప్రాణాలు వదిలారు. దేశంలో మ‌ళ్లీ అవే ప‌రిస్థితులు సంభ‌విస్తున్నాయి.

క‌రోనా ఉద్ధృతి ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోన్న‌ మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, యావత్మాల్‌ జిల్లాలోని వణీ గ్రామంలో శానిటైజర్‌ తాగి ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్ర‌స్తుతం వారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది.

మద్యానికి బానిస అయిన వీరు శానిటైజ్ సేవించితే మందు తాగినంత ఫీలింగ్ ఉంటుందని భావించి తాగారు. శానిటైజ‌ర్ తాగి ప‌డిపోగా గుర్తించిన స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, ఆసుప‌త్రికి తీసుకెళ్లేలోపే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మ‌రో న‌లుగురు చికిత్స తీసుకుంటూ మృత్యువాత ప‌డ్డారు.

కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి!

తప్పదు.. ఢిల్లీలో మరో వారంపాటు లాక్‌డౌన్‌: కేజ్రీవాల్

క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన మిథాలి రాజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -