Friday, April 19, 2024
- Advertisement -

నవ్వించడానికి మేం వస్తున్నాం.. ఎఫ్ 3 లేటెస్ట్ అప్ డేట్స్!

- Advertisement -

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి చేస్తున్న సినిమా ఎఫ్3. ఈ సినిమా సూర్ హిట్ అయిన ఎఫ్2కు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు.. తాజాగా ఈ చిత్ర సీక్వెల్ కు షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమాను కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు కథను లాక్‌డౌన్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపుడి సిద్దం చేశాడు. 

అయితే ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్ ఇచ్చాడు దర్శకుడు అనిల్. ఈ సినిమాను కుదిరినంత త్వరగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రీకరణను శరవేగంతో పూర్తి చేస్తున్నామని, చివరికీ వారంతాల్లో కూడా సెలవులే తీసుకోకుండా చేస్తున్నామన్నాడు. 

ఈ సినిమాలో మాస్ మహరాజ, సునీల్ ఓ పాత్రలో కనిపిస్తారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ సరైన క్లారిటీ మాత్రం రాలేదు. ఈ రోజు రిలీజ్ చేసిన ఫోటోలో సునీల్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చాలా కొత్త తరహాలో ఉండబోతుందని, దీనిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు దర్శకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -