Tuesday, April 23, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫస్ట్ లుక్ రిలీజ్..!

- Advertisement -

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఫస్ట్ కాంబినేషన్ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు  ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పూరీ జగన్నాథ్ ఎప్పుడూ తన సినిమాలకు చిత్రమైన టైటిల్స్ పెడుతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఇందులో బాక్సర్​గా రౌడీ హీరో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

గతంలతో అమ్మానాన్న ఓ తెలుగు అమ్మాయి చిత్రంలో మాస్ మహరాజ రవితేజకు మంచి హిట్ అందించారు పూరి. ఇందులో కిక్ బాక్సర్ గా కనిపించాడు. తాజాగా ఇప్పుడు రవితేజ అదే లుక్ లో కనిపిస్తున్నాడు. చిరుత కళ్ళతో సింహంలా రెచ్చిపోతున్నాడు. చేతికి గ్లౌజ్ వేసుకుని సింహంలా చూస్తున్నాడు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం విజయ్.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు.

ఇందులో విజయ్​ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్యపాండే హీరోయిన్​గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పీసీ కనెక్ట్స్​, ధర్మా ప్రొడక్షన్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పోస్టర్ రిలీజ్ అయ్యిందో లేదో.. రౌడీ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో విజయ్ దేవరకొండ అభిమానులు హంగామా మొదలెట్టేశారు. వినైల్ పోస్టర్స్ ను కూడళ్ళ లో పెట్టి దానికి పాలాభిషేకం చేసిన వారు కొందరైతే, ఆ పోస్టర్ ముందు కేక్ కట్ చేసి… సంబరాలు జరుపుకున్న వాళ్ళు మరికొందరు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -