Friday, May 3, 2024
- Advertisement -

త్రిష సినిమా పేరు తెలిస్తే నవ్వుతారు

- Advertisement -

తాజా కోలీవుడ్ సినిమా రిపోర్ట్స్ ప్రకారం స్టార్ హీరోయిన్ త్రిష, సిమ్రాన్ కలిసి ఒక ఆసక్తికరమైన సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ని సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వం లో ఒక యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కించనున్నారు నిర్మాతలు. ఈ దర్శకుడు ఇంతకు ముందు సాధూరాం 2 సినిమా చేశారు. అయితే ఈ సినిమా కి ఒక ఆసక్తికర టైటిల్ .పెట్టారు. టైటిల్ వింటే మొదటగా మనకి నవ్వు రావడం ఖాయం. ఈ సినిమా కి షుగర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.

త్రిష, సిమ్రాన్ ఇంతకు ముందు రజినీకాంత్ పెట్ట చిత్రం లో నటించారు. కానీ సినిమా లో ఇద్దరికీ సీన్లు లేవు. అయితే 1999 లో ప్రశాంత్ మరియు సిమ్రాన్ కలిసి నటించిన జోడి అనే సినిమా లో త్రిష ఒక చిన్న పాత్ర చేసింది. చాన్నేళ్లకు ఈ సినిమాలో ఇప్పుడు ఈ ఇద్దరు అందమైన భామలు కలిసి నటించనున్నారు.

అల్ ఇన్ పిక్చర్స్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు గొరిల్లా సినిమా చేసింది కూడా వీరే. సంతోష్ దయానిధి ఈ సినిమా కి సంగీత దర్శకుడు. సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -